
అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
పెద్దకొడప్‌గల్(జుక్కల్): ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాలను మంగళవారం వ్యవసాయ శాఖ ఏఈవో కిషన్ ఆధ్వర్యంలో తహసీల్దార్ దశరథ్, ఎస్సై అరుణ్‌తో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో రైతులు వచ్చి దుకాణదారులు ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ఫిర్యాదు చేశారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకొని అధిక ధరలకు విక్రయించిన దుకాణ యజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.