
బాధితులకు అండగా భరోసా కేంద్రం
● ఏఎస్పీ నర్సింహా రెడ్డి
కామారెడ్డి క్రైం: బాధిత మహిళలు, చిన్నారులకు భరోసా కేంద్రం అండగా నిలుస్తోందని ఏఎస్పీ నర్సింహారెడ్డి అన్నారు. అత్యాచారం, పోస్కో కేసుల్లో బాధితులుగా ఉన్న 13 మంది మహిళలు, చిన్నారులకు ప్రభు త్వం నుంచి మంజూరైన ఆర్థిక సహాయం చెక్కులను మంగళవారం కామారెడ్డిలోని భరోసా కేంద్రంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధితులకు న్యాయం, భద్రత, మనోధైర్యం కల్పించే ఉద్దేశంతో భరోసా కేంద్రం పని చేస్తుందన్నారు. సీఐలు మురళి, సంతోష్ కుమార్, మహిళా ఎస్సై జ్యోతి, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్ కవిత, సిబ్బంది పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇంటి పనులు త్వరగా పూరి ్తచేయాలి
బాన్సువాడ రూరల్: ఇందిరమ్మ ఇంటి పనులు ప్రారంభించిన లబ్ధిదారులు త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని, ఇంకా ప్రారంభించని వారు వీలైనంత త్వరగా పనులు ప్రారంభించాలని బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్ సూచించారు. మంగళవారం ఆయన బోర్లంలో పర్యటించి ఇళ్ల పురోగతిని పరిశీలించారు. పలు సూచనలు చేశారు.
ఒడ్డేపల్లిలో..
నిజాంసాగర్(జుక్కల్): ఒడ్డేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను మంగళవారం ఎంపీడీవో గంగాధర్ పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
ఎస్టీ జాబితాలో చేర్చండి
కామారెడ్డి క్రైం: లబానాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని లబానా లంబాడా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తాన్‌సింగ్ అన్నారు. లబానా లంబాడా రాష్ట్ర సంఘం ప్రతినిధులు మంగళవారం ఢిల్లీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం తాన్‌సింగ్ సాక్షితో మాట్లాడుతూ.. 1986లో లబానాలను ఎస్టీ జాబితాలో నుంచి తొలంగించారని తెలిపారు. వెనకబడిన తమను తిరిగి ఎస్టీ జాబితాలో కొనసాగించాలని కోరారు.

బాధితులకు అండగా భరోసా కేంద్రం