నలుగురు పీఎంపీలపై కేసులు | - | Sakshi
Sakshi News home page

నలుగురు పీఎంపీలపై కేసులు

Jun 5 2025 7:34 AM | Updated on Jun 5 2025 7:34 AM

నలుగు

నలుగురు పీఎంపీలపై కేసులు

గాంధారి: మండల కేంద్రంలో అర్హతలు లేకున్నా ఆస్పత్రులు నడుపుతూ బెడ్స్‌ ఏర్పాటు చేసి ఇన్‌పేషెంట్లకు చికిత్సలు చేస్తున్న నలుగురు పీఎంపీలపై బుధవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఆంజనేయులు తెలిపారు. పీఎంపీలు నరేందర్‌, హేమ్‌సింగ్‌, అంజయ్య, ఆంజనేయులు రోగులను చేర్పించుకుని చికిత్సలు చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదుల మేరకు మెడికల్‌ కౌన్సిల్‌ సభ్యులు తనిఖీలు నిర్వహించారన్నారు. వారి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు.

‘అధికారులు

అప్రమత్తంగా ఉండాలి’

బీబీపేట: వర్షాకాలం నేపథ్యంలో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని డీపీవో మురళి సూచించారు. బుధవారం మండల కేంద్రంలోని పలు కాలనీలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పంచాయతీలలో ఆయిల్‌ బాల్స్‌ను సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు. అనంతరం మండలకేంద్రంలో నిర్మించిన ఇందిరమ్మ మోడల్‌ హౌజ్‌ను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీవో అబ్బాగౌడ్‌, కార్యదర్శి రమేష్‌, కారోబార్‌ సిద్దరాములు, కాంగ్రెస్‌ మండలాధ్యక్షుడు సుతారి రమేష్‌ తదితరులున్నారు.

ఫర్టిలైజర్‌ దుకాణాలపై దాడులు

నాగిరెడ్డిపేట: మండలకేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాలపై బుధవారం జిల్లా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో రైతులకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న విత్తనాలను, స్టాక్‌ రిజిస్టర్‌ను తనిఖీ చేశారు. రైతులకు నాణ్యమైన, గుర్తింపు పొందిన కంపెనీల విత్తనాలనే విక్రయించాలని దుకాణాదారులకు సూచించారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. తనిఖీలలో టాస్క్‌ఫోర్స్‌ అధికారులు అనిల్‌కుమార్‌, మహ్మద్‌ నదీముద్దీన్‌, ఎల్లారెడ్డి సీఐ రవీందర్‌ నాయక్‌, నాగిరెడ్డిపేట ఎస్సై మల్లారెడ్డి, ఏవో సాయికిరణ్‌ పాల్గొన్నారు.

బాన్సువాడ బల్దియా నుంచి

కొయ్యగుట్ట తండా తొలగింపు

బాన్సువాడ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో విలీనమైన కొయ్యగుట్ట తండాను మున్సిపల్‌ పరిధి నుంచి తొలగించినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీహరి రాజు తెలిపారు. బుధవా రం బాన్సువాడ మున్సిపాలిటీ కార్యాలయంలోని నోటీసు బోర్డుపై మున్సిపల్‌ నుంచి తొలగించిన కొయ్యగుట్ట తండా వివరాలను అతికించారు. మున్సిపల్‌ చట్టం ప్రకారం బాన్సువాడ మున్సిపాలిటీలోని 2వ వార్డులో ఉన్న కొయ్యగుట్ట తండాను తొలగించినట్లు తెలిపారు. తండా వాసుల నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉంటే 11 వ తేదీ వరకు మున్సిపాలిటీలో తెలియజేయాలని సూచించారు. మున్సిపాలిటీ పరిధిలో 19 వార్డులు ఉన్నాయని, అన్ని వార్డులు అలాగే ఉంటాయని తెలిపారు.

కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

కామారెడ్డి క్రైం: నిజాంసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌.మోహన్‌ సింగ్‌ అనే కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. విధుల్లో నిర్లక్ష్యం వహించడం, పోలీసు ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించే చర్యలకు పాల్పడడం, అనైతిక ప్రవర్తనలకు సబంధించిన ఆరోపణలు రావడంతో విచారించి ఈ చర్య తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ రాజేశ్‌ చంద్ర బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనైతిక చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు.

నలుగురు పీఎంపీలపై కేసులు
1
1/3

నలుగురు పీఎంపీలపై కేసులు

నలుగురు పీఎంపీలపై కేసులు
2
2/3

నలుగురు పీఎంపీలపై కేసులు

నలుగురు పీఎంపీలపై కేసులు
3
3/3

నలుగురు పీఎంపీలపై కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement