బాబు డ్రామాలకు అత్యున్నత బ్రేక్‌! | - | Sakshi
Sakshi News home page

బాబు డ్రామాలకు అత్యున్నత బ్రేక్‌!

Oct 10 2026 1:04 AM | Updated on Oct 10 2026 1:04 AM

వైఎస్‌ జగన్‌

హయాంలోనే పదవులు

సుప్రీం కోర్టు తీర్పుతో వెన్నుపోటు పార్టీ నాయకుడు చంద్రబాబు నిజ స్వరూపం బట్టబయలైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు గొప్పగా రిలీజ్‌ చేసిన రెండు జీఓలు 105, 1,065లు కొట్టి వేస్తూ హైకోర్టు తీర్పు చెప్పడం వెన్నుపోటు పార్టీకి చెంపపెట్టు. అది చాలదన్నట్లు సుప్రీంకు వెళ్లారు. అక్కడ చుక్కెదురైంది. ఆది నుంచీ బాబుకు బీసీలంటే చిన్నచూపు.

– అల్లి రాజబాబు,

వైఎస్సార్‌ సీపీ బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు

అన్యాయం చేస్తున్న

చంద్రబాబు

బీసీలను ఉపయోగించుకుంటూ వారికి అన్యాయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. 34 శాతం రిజర్వేషన్లు అమలు చేయడం సాధ్యం కాదని తెలిసీ బీసీలను నమ్మించడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మంత్రి, కార్పొరేషన్‌ పదవుల్లోనూ ప్రాధాన్యం ఇవ్వాలి. వైఎస్‌ జగన్‌ పాలనలో బీసీలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.

– ఆవాల లక్ష్మీనారాయణ, రాష్ట్ర బీసీ

అయ్యరక సంఘ అధ్యక్షుడు, సామర్లకోట

చట్టబద్ధమైన హక్కులు కావాలి

హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ బీసీలను మరోసారి వెన్నుపోటు పొడవడానికి చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. బీసీలను ఎన్నికల సమయంలో గుర్తు చేసుకుని, ఆ తర్వాత వారి హక్కులను విస్మరించడం తగదు. నిజంగా న్యాయం చేయాలంటే జగన్‌ ప్రభుత్వం అమలు చేసిన రాజకీయ సాధికారత చర్యల నుంచి నేర్చుకోండి. బీసీలకు పదవులు ఇవ్వండి, నిధులు కేటాయించండి, స్థానిక సంస్థల్లో చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోండి.

– ఒమ్మి రఘురామ్‌, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శి

సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీసీలకు రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు ఆడుతున్న డ్రామాకు అత్యున్నత న్యాయస్థానం బ్రేక్‌లు వేసింది. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల్లో 34 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ, జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. దీనిపై తాజాగా సుప్రీంకోర్టు నుంచి సైతం చుక్కెదురైంది. బీసీ రిజర్వేషన్లపై దాఖలు చేసిన పిటీషన్‌ను శుక్రవారం డిస్మిస్‌ చేసింది. దీంతో చంద్రబాబు బీసీల వంచనకు చేస్తున్న ప్రయత్నాలకు చరమగీతం పాడినట్లు అయ్యింది. ఈ పరిణామం ఆ వర్గాల్లో అగ్రహావేశాలు నింపుతోంది. సాధ్యం కాదని తెలిసి కూడా బీసీలను మోసం చేసి, స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని భావించడంపై ఆయా సంఘాలు మండిపడుతున్నాయి.

సాధ్యం కాదని తెలిసినా వంచన

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్‌ సాధ్యం కాదని తెలిసినా.. స్థానిక ఎన్నికల్లో బీసీల ఓట్లు కొల్లగొట్టేందుకు కపట ప్రేమ చూపించారు. సుప్రీం మార్గదర్శకాల మేరకు చట్టబద్ధం చేయాల్సిన బాబు.. డెడికేషన్‌ కమిషన్‌ ఏర్పాటు పేరుతో మరో నాటకానికి తెరలేపారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందే జీఓలు జారీ చేయడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని సార్వత్రిక ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు చంద్రబాబు. అందుకు అనుగుణంగా చట్టం చేయాల్సి ఉన్నా.. అదేమీ పట్టించుకున్న పాపానపోలేదు. అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు.

గతంలో వ్యతిరేకించి..

స్థానిక సంస్థల్లో బీసీల రిజర్వేషన్లకు సంబంధించి 2019లో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం జీఓ నంబర్‌ 176 జారీ చేసి, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు సిద్ధమైంది. అప్పట్లో చంద్రబాబు తన పార్టీ నాయకుడు, అంతకు ముందు తన ప్రభుత్వంలో ఏపీ స్టేట్‌ ఎంపాయిమెంట్‌ గ్యారంటీ కౌన్సిల్‌ (ఏపీఎస్‌ఈజీసీ) సభ్యుడిగా ఉన్న వ్యక్తితో హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ కేసులు వేయించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదన్న ఆదేశాలతో బీసీ రిజర్వేషన్లు కొట్టేస్తున్నామని హైకోర్టు అప్పట్లో తీర్పు ఇచ్చింది. రిజర్వేషన్లు 50 శాతం దాటకూడదని హైకోర్టులు, సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని తెలిసి, ఇదే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కొట్టేసిందని తెలిసి, మరోసారి మహా డ్రామాకు చంద్రబాబు తెరలేపడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది.

జిల్లాలో ప్రాధాన్యమిలా..

కాకినాడ స్మార్ట్‌ సిటీ చైర్మన్‌గా బీసీలకు అవకాశం ఇచ్చారు. తుని మున్సిపల్‌ చైర్మన్‌ ఓసీ అయినా బీసీకి ఇచ్చారు. వివిధ కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా 10 మందికి అవకాశం కల్పించారు. పెద్దాపురం అయ్యరక కార్పొరేషన్‌ చైర్మన్‌, కాకినాడ కార్పొరేషన్‌ వైస్‌ చైర్మన్‌గా అకాశం ఇచ్చారు. అన్నవరంలో దేవస్థానంలో ఇద్దరిని బోర్డ్‌ మెంబర్లుగా, లోవ చైర్మన్‌గా నియమించారు. కార్పొరేటర్లుగా, పెద్దాపురం మున్సిపాలిటీ వైస్‌ చైర్మన్‌గా అవకాశం కల్పించారు.

ఫ బీసీలకు 34 శాతం

రిజర్వేషన్‌ కపట ప్రేమే

ఫ న్యాయస్థానాల్లో చుక్కెదురవుతుందని

తెలిసీ మోసం చేసేందుకు కుట్ర

ఫ స్థానిక సంస్థల్లో బీసీల

తిరుగుబాటు తప్పదనే ఈ డ్రామా

ఫ వైఎస్సార్‌ సీపీ హయాంలో

నామినేటెడ్‌ పదవుల్లో అగ్రస్థానం

బీసీల పక్షపాతి వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బీసీలకు సంక్షేమం, రాజకీయ ప్రాధాన్యం కల్పించారు. బీసీల కోసం ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయడం, నామినేటెడ్‌ పదవుల్లో అవకాశాలు కల్పించడం, బీసీ నాయకులకు ఉన్నత రాజకీయ బాధ్యతలు అప్పగించడం వంటి చర్యల ద్వారా బీసీలను పాలనలో భాగస్వాములను చేశారు. బీసీ రిజర్వేషన్‌ను కోర్టులు కొట్టేసినా.. బీసీలకు ఆ మేరకు రాజకీయంగా ప్రోత్సాహం ఇవ్వాలన్న ఉద్దేశంతో స్వతహాగా 34 శాతం కంటే ఎక్కువగా ప్రాతినిధ్యం కల్పించింది. రాష్ట్ర క్యాబినెట్‌లో 25 మంత్రులు ఉంటే అందులో 11 మంది బీసీలు, రాష్ట్ర కోటాలో భర్తీ అయిన 11 రాజ్యసభ సీట్లకు నలుగురు బీసీలను పంపించింది. చంద్రబాబు 2014–19 మధ్య ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. బీసీలకు చట్టసభల్లో 50 శాతం సీట్లు కేటాయించాలని కోరుతూ పార్లమెంట్‌లో వైఎస్సార్‌ సీపీ ఎంపీలతో ప్రైవేట్‌ బిల్లును పెట్టించిన ఘనత వైఎస్సార్‌ సీపీకే దక్కుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement