పులి సంచారంతో కలకలం | - | Sakshi
Sakshi News home page

పులి సంచారంతో కలకలం

Oct 10 2026 1:04 AM | Updated on Oct 10 2026 1:04 AM

నిడదవోలు/తాడేపల్లిగూడెం: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి, కాల్దరి గ్రామాల మధ్యన వరి పొలంలో శుక్రవారం పులి సంచరించడంతో కలకలం రేగింది. పులి వరి పొలంలో ఉదయం నుంచి రోజంతా పడుకునే ఉంది. గోదావరి దాటి వచ్చిన పులి దేవరపల్లి మండలం లక్ష్మీపురం, చాగల్లు మండలం చిక్కాల మధ్య గురువారం రాత్రి సంచరించినట్టు అటవీ అధికారులు గుర్తించారు. అక్కడి నుంచి పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మిలటరీ మాధవరం వైపు వెళ్లి.. అటు నుంచి తిరిగి తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం వేలివెన్ను పొలాల మీదుగా పసలపూడి శివారున వరి పొలాల్లో ప్రత్యక్షమైంది. జీపీఎస్‌ ట్రాకింగ్‌ ఉన్న ఈ పులి కదలికలను అటవీ అధికారులు డ్రోన్‌ కెమెరాలతో పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకోవడానికి పోలీస్‌, రెవెన్యూ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రాత్రి ఏడు గంటల సమయంలో వరి పొలాల్లో ఉన్న పులి మళ్లీ బయటికొచ్చిందని, కాల్దరి గ్రామ కాలువ గట్టు మీదుగా పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం నందమూరు పొలాల్లోకి చేరుకుందని గుర్తించారు. పుణే నుంచి నిఫుణుల బృందం శనివారం చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement