రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాటకం | - | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాటకం

Oct 10 2026 1:04 AM | Updated on Oct 10 2026 1:04 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ)/ రాజమహేంద్రవరం రూరల్‌: రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు నాటకాలు ఆడుతున్నారని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర బీసీ సెల్‌ వర్కింగ్‌ ప్రెసి డెంట్‌ నౌడు వెంకటరమణ శుక్రవారం ఓ ప్రకటనలో విమర్శించారు. రాజ్యాంగ నిబంధనలు, గత సుప్రీంకోర్టు తీర్పులు వెన్నుపోటు బాబుకు తెలిసినా బీసీ ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు పబ్లిసిటీ స్టంట్‌ డ్రామాతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం క్షమించరాని నేరమని అన్నారు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పేరుతో చంద్రబాబు పొలిటికల్‌ గేమ్‌ దేశ సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో బట్టబయలైందని తెలిపారు. బాబుకు బీసీలపై అంత ప్రేమే ఉంటే రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాలతో భేటీ అయినప్పుడైనా రిజర్వేషన్లపై వారికి వినతిపత్రం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కానీ అవేమీ లేకుండా బీసీలను వలలో వేసుకునే నాటకం ఆడారని విమర్శించారు.

స్టాన్‌ఫోర్డ్‌ మెచ్చిన శాస్త్రవేత్తలు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): స్టాన్‌పోర్డ్‌ యూనివర్సిటీ, ఎల్స్వియర్‌ ప్రచురణ సంస్థలు సంయుక్తంగా ప్రతి ఏటా ప్రకటించే వరల్డ్‌ టాప్‌ శాస్త్రవేత్తల జాబితా విడుదలైంది. ఇందులో జేఎన్‌టీయూ కాకినాడ ఇంజినీరింగ్‌ కళాశాల ప్రొఫెసర్‌, ఐఎస్‌టీ డైరెక్టర్‌ బత్తుల తిరుమలకృష్ణ (ఈసీఈ), జేఎన్‌టీయూకే రిజిస్ట్రార్‌ రాయపూడి శ్రీనివాసరావు (ఈఈఈ) స్థానం పొందారు. శ్రీనివాసరావు 2022 నుంచి 25 వరకూ ఇప్పటికి ఐదుసార్లు స్థానం సాధించగా, తిరుమలకృష్ణ 2024 నుంచి 26 వరకూ మూడు సార్లు చోటు దక్కించుకున్నారు. ఎనర్జీ విభాగంలో శ్రీనివాసరావుకు 6,057 ర్యాంక్‌, తిరుమలకృష్ణ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ టెక్నాలజీ విభాగంలో 7,551 ర్యాంక్‌ సాధించారు. ఈ సందర్భంగా వారిని జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌, టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది శుక్రవారం అభినందించారు.

స్పెషల్‌ టెట్‌ నిర్వహణకు

పటిష్ట ఏర్పాట్లు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో ఈ నెల 11 నుంచి 15 వరకు ఏపీ స్పెషల్‌ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (స్పెషల్‌ టెట్‌–2026) ను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జేసీ అపూర్వ భరత్‌ తెలిపారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో స్పెషల్‌ టెట్‌ నిర్వహణకు సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయుల కోసం నిర్వహించే ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ఈ పరీక్షలు రోజూ రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో కంప్యూటర్‌ వ్యవస్థ, ఇంటర్నెట్‌ కనెక్టివిటీ సక్రమంగా పనిచేసేలా ముందస్తు తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో రెండు పరీక్ష కేంద్రాల్లో మొత్తం 4,465 మంది అభ్యర్థులు స్పెషల్‌ టెట్‌ రాయనున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement