కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజలకు విశేష సేవలందించాం.
వలంటీర్ల జీతాలు రూ.10 వేలకు పెంచుతామని గత ఎన్నికల్లో చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మమ్మల్ని పూర్తిగా తొలగించి మోసం చేశారు. ఇప్పుడేమో నిరుద్యోగులకు భృతి కూడా ఇవ్వడం లేదు. సొంత డప్పు కొట్టుకోవడానికి మాత్రం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు రూ.లక్షల
ప్రజాధనం ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.
–జిత్తుగ రామస్వామి, మాజీ వలంటీర్, వానపల్లి, కొత్తపేట మండలం
వలంటీర్లకు తీవ్ర అన్యాయం
ఎన్నికల ముందు వలంటీర్లకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టాక దగా చేశారు. ఇప్పుడేమో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరిట ప్రభుత్వ ప్రచారం కోసం ప్రజల సొమ్ము దుబారా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ప్రభుత్వంలో కరోనా వంటి విపత్కర సమయాల్లో ప్రజలకు అనేక సేవలు అందించాం. అలాంటి మమ్మల్ని తొలగించి తీవ్ర అన్యాయం చేశారు. ఉన్న కొద్దిపాటి ఉపాధి లేకుండా చేసి ఇబ్బందులు పెట్టారు.
–పాలింగి కమల, మాజీ వలంటీర్, ర్యాలి, ఆత్రేయపురం మండలం


