పేదలకు గూడు దూరం చేస్తున్న ప్రభుత్వం | - | Sakshi
Sakshi News home page

పేదలకు గూడు దూరం చేస్తున్న ప్రభుత్వం

Oct 10 2026 1:04 AM | Updated on Oct 10 2026 1:04 AM

సామర్లకోట: హామీలు ఇవ్వడం, ఆనక మరిచిపోవడం సీఎం చంద్రబాబు నైజమని వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దొరబాబు అన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో మున్సిపాలిటీ పరిధిలోని 22 నుంచి 31 వార్డులకు చెందిన అనేక మందికి వేట్లపాలెంలో పట్టాలు ఇచ్చామని, వాటిని తీసుకోవద్దని కూటమి నాయకులు చెప్పిన మాటలు లబ్ధిదారులు నిరాకరించారన్నారు. అప్పట్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే, తాము పట్టణంలోనే స్థలాలు ఇస్తామని చెప్పి లబ్ధిదారులను మోసం చేశారని ఆయన అన్నారు. రెండున్నరేళ్లు పూర్తవుతున్నా ఇప్పటి వరకు కూటమి నాయకులు న్యాయం చేయకపోవడంతో స్థానిక మెహర్‌ కాంప్లెక్స్‌ గణపతి ఆలయం వద్ద లబ్ధిదారులు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు వైఎస్సార్‌ సీపీ మద్దతు తెలియజేసింది. ఈ సందర్భంగా దొరబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం పేదలకు గూడును దూరం చేస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే సామర్లకోటలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని అన్నారు. కార్యక్రమంలో నాయకులు పాగా సురేష్‌కుమార్‌, ఆవాల లక్ష్మీనారాయణ, గోపు మురళీ, ఉబా జాన్‌మోజెస్‌, రాకరణం భాను, దవులూరి సుబ్బారావు, మన్యం చంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్‌ దొరబాబు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement