విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
నల్లజర్ల: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన పోతవరంలో శనివారం ఉదయం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తాడిచర్ల హరిబాబు (28) స్నానం చేయడానికి బాత్రూమ్‌లోని గీజర్ స్విచ్ వేశాడు. దానికి విద్యుత్ సరఫరా జరగడంతో షాక్‌కు గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కొయ్యలగూడెం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. హరిబాబు పోతవరంలో చెప్పుల షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య గౌతమీ ప్రియ, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై దుర్గాప్రసాదరావు తెలిపారు.
కదిలే రైలు ఎక్కబోతూ
జారి పడి..
● తండ్రీ కుమార్తెలకు తీవ్ర గాయాలు
● నిడదవోలు స్టేషన్‌లో ఘటన
నిడదవోలు: కదులుతున్న రైలును ఎక్కే ప్రయత్నంలో తండ్రీ కుమార్తెలు జారిపడి తీవ్ర గాయాలపాలయ్యారు. నిడదవోలు రైల్వేస్టేషన్‌లో శనివారం ఈ ఘటన జరిగింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి గ్రామానికి చెందిన టి.ఉమా మహేశ్వరరావు తన కుటుంబంతో తిరుపతి–పూరి ఎక్స్‌ప్రెస్‌లో తిరుపతికి బయలుదేరారు. రైలు నిడదవోలు రైల్వేస్టేషన్‌లో ఆగిన సమయంలో ఉమా మహేశ్వరరావు తన నాలుగేళ్ల కుమార్తె పవిత్రను తీసుకుని వాటర్ బాటిల్ కోసం స్టేషన్‌లో దిగారు. ఇంతలో రైలు కదిలిపోవడంతో కంగారుగా ఎక్కే ప్రయత్నం చేశారు. ఒక చేతితో కుమార్తెను ఎత్తుకుని, మరో చేతితో రైలు ముఖద్వారం వద్ద నున్న ఐరన్ రాడ్‌ను పట్టుకునే క్రమంతో అదుపుతప్పి ఇద్దరూ జారిపడి ప్లాట్‌ఫాంపై పడ్డారు. వెంటనే రైలును పైలట్ నిలిపివేవడంతో లోపల ఉన్న బంధువులు దిగారు. రైల్వే పోలీసులు అక్కడకు వచ్చి తీవ్రంగా గాయపడిన తండ్రీ కుమార్తెలను నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి


