ఆస్పత్రిలో వ్యక్తి మృతిపై అధికారుల విచారణ
సామర్లకోట: స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో వైద్యానికి వచ్చిన మలిరెడ్డి భూచక్రం మృతి చెందిన ఘటనపై జిల్లా అధికారులు శనివారం సాయంత్రం ఆ ఆస్పత్రిలో విచారణ ప్రారంభించారు. ట్రైనీ కలెక్టర్ మనిషా జంగు, కాకినాడ ఆర్డీఓ ఎస్ మల్లిబాబు, డీఎంఅండ్‌హెచ్‌ఓ కార్యాలయ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్.లావణ్య కుమారి, హెచ్‌ఓడీ డాక్టర్ యశోదమ్మ విచారణ చేశారు. సామాజిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ దవులూరి దొరబాబు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆదేశాలతో అధికారులు ఈ విచారణ ప్రారంభించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి డ్యూటీలో ఉన్న సిబ్బంది నుంచి సమాచారం సేకరించారు. డ్యూటీలో ఉండాల్సిన డాక్టర్‌ను విచారణ చేశారు. విధుల్లో ఉండాల్సిన డాక్టర్ డ్యూటీలో లేరని నిర్ధారించారు. అనంతరం భూచక్రం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. దీనిపై నివేదికను కలెక్టర్‌కు అందజేస్తామని ఆర్డీఓ తెలిపారు.


