పెద్ద దిక్కు కోల్పోయిన కుటుంబం
కారు ఢీకొనడంతో మృతి చెందిన కాకడ రాజు స్వగ్రామం ఏలేశ్వరం. తాపీమేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య అర్జమ్మ, ముగ్గురు కుమారైలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో చిన కుమారుడికి మాత్రమే వివాహం కావాల్సి ఉంది. అర్జమ్మ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా రహదారి పక్కనే బొప్పాయి, పుచ్చకాయలు విక్రయిస్తుంది. రాజు ఆ కాయలను పెద్దాపురం నుంచి కొనుగోలు చేసి ఏలేశ్వరం తీసుకు వస్తాడు. రోజూ మాదిరిగానే పెద్దాపురం వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.


