
ఆ రూ.7 వేలు ఏ మూలకు?
ఖరీఫ్‌లో పంటలు పండించుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఇవ్వనున్న రూ.7 వేలు ఏ మూలకు సరిపోతాయో అర్థం కావడం లేదు. ఈ సొమ్ముతో 3 డీఏపీ బస్తాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. రైతులందరికీ అన్నదాత సుఖీభవ లబ్ధి చేకూరుతుందనే నమ్మకం చిక్కడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్‌లో పెట్టుబడి కోసం రైతులు నానా పాట్లూ పడుతున్నారు. – ఇంటి రమేష్, వీకే రాయపురం, సామర్లకోట మండలం
రెండు విడతల్లో ఇస్తే ప్రయోజనం
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు కష్టంగా మారుతోంది. పెట్టుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. దమ్ములు, నాట్లు, కూలి రేట్లు, ఎరువుల ధరలు ఇలా అన్నీ ఇదివరకటి కంటే పెరిగిపోయాయి. అన్నదాత సుఖీభవలో ప్రభుత్వ వాటాను రెండు విడతలుగా ఇవ్వాలి. తొలి విడతగా రూ.10,000 ఇస్తే రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.
– తుమ్మలపల్లి సత్తిరాజు (చంటిబాబు), రైతు, పండూరు, కాకినాడ రూరల్

ఆ రూ.7 వేలు ఏ మూలకు?