ఏపీలో మోసపోయిన గద్వాల మిర్చి రైతులు
● రైతులకు తెలియకుండానే 1,357 బస్తాల విక్రయం
● గుంటూరులోని ఓ ట్రేడర్, కోల్డ్ స్టోరేజీ యజమానులు కుమ్మకై ్క బాగోతం
● అటు ఏపీ, ఇటు తెలంగాణ అధికారుల చుట్టూ రైతన్నల ప్రదక్షిణలు
●
అధికార నేతలమని
బెదిరిస్తున్నారు..
గుంటూరులోని లీల గాయత్రి కోల్డ్‌స్టోరేజీ నిర్వాహకులు మాకు తెలియకుండా మేము నిల్వ చేసిన మిర్చి బస్తాలను అమ్ముకున్నారు. ఇదేంటని అడిగితే మాకు సంబంధం లేదు.. ట్రేడింగ్ కంపెనీ వాళ్లు తీసుకున్నారని చెబుతున్నారు. బస్తాలకు సంబంధించి బాండ్లు మా పేరున ఇచ్చారు.. ఆ బస్తాలు మాకే ఇవ్వాలి.. ట్రేడర్‌కు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తే దబాయిస్తున్నారు. అధికార నేతలమంటూ బెదిరిస్తున్నారు. ఇప్పటికే రూ.లక్షల్లో అప్పులయ్యాయి. నిల్వ మిర్చి పైనే నమ్మకం పెట్టుకుని జీవిస్తున్నాం. ఇరు ప్రభుత్వాలు మాకు న్యాయం చేయాలి. లేకుంటే మాకు ఆత్మహత్యలే శరణ్యం.
– నాగశేషి, రైతు,
మానవపాడు, జోగుళాంబ గద్వాల జిల్లా
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకుందామనుకుని నిల్వ చేసుకున్న ఆ మిర్చి రైతుల ఆశలు అడియాసలయ్యాయి. ట్రేడింగ్ కంపెనీ, కోల్డ్‌స్టోరేజీ కుమ్మకై ్క నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. నట్టేట మునిగినట్లు ఆలస్యంగా తెలుసుకున్న ఆ రైతులు లబోదిబోమని మొత్తుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో ఓ కోల్డ్‌స్టోరేజీ నిర్వాహకుల చేతిలో మోసపోయిన తెలంగాణలోని జోగుళాంబ గద్వాల జిల్లాకు చెందిన పలువురు మిర్చి రైతుల కన్నీటి గాథ..
గద్వాల జిల్లా మానవపాడు, బోరవెల్లి గ్రామానికి చెందిన రైతులు సాయిబాబా, నాగశేషి, బజారి, రాముడు, విజయ్, నాగరాజు, రమేష్ 2023 మే 6న తాము పండించిన సూపర్–10 రకం మిర్చి 1,357 బస్తాలను అమ్ముకునేందుకు ఏపీలోని గుంటూరు వ్యవసాయ మార్కెట్‌కు తీసుకెళ్లారు. అయితే మద్దతు ధర తక్కువ ఉండడంతో ఈశ్వరి ట్రేడింగ్ కంపెనీ ద్వారా లీల గాయత్రి కోల్డ్‌స్టోరేజీలో నిల్వ చేశారు. ట్రేడింగ్ కంపెనీ ద్వారా వచ్చిన బాండ్లను సదరు రైతులు కోల్డ్ స్టోరేజీ నిర్వాహకుల వద్ద తాకట్టుపెట్టి ఒక బస్తాకు రూ.3 వేల చొప్పున లోన్ తీసుకున్నారు. మార్కెట్‌లో మంచి ధర వచ్చే వరకు వేచి చూస్తున్న క్రమంలో రెండున్నరేళ్లు గడిచింది. ప్రతి సంవత్సరం ఒకట్రెండు సార్లు ఒక్కొక్కరు వెళ్లి ఆ బస్తాలను చూసుకునే వారు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కోల్డ్ స్టోరేజీ నిర్వాహకులకు రైతులు ఫోన్ చేయగా.. మీ బస్తాలు లేవని చెప్పడంతో వారు కంగుతిని గుంటూరుకు వెళ్లారు.
గుంటూరులోని కోల్డ్‌స్టోరేజీలో నిల్వ


