ఇంటర్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు పారదర్శకంగా నిర్వహించాలి

Mar 3 2026 8:19 AM | Updated on Mar 3 2026 8:19 AM

గద్వాల: జిల్లాలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషాషేక్‌ అన్నారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని వాగ్దేవి జూనియర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్‌ పరీక్షల కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి.. నిర్వహణ తీరును పరిశీలించారు. విద్యార్థుల హాజరు వివరాలు, సీసీ కెమెరాల పనితీ రు, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ పర్యవేక్షణ వివరాలను చీఫ్‌ సూపరింటెండెంట్‌ కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు ఇతర సిబ్బంది మొబైల్‌ ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులను పరీక్ష కేంద్రంలోకి తీసుకురావొద్దని సూచించారు. కార్యక్రమంలో చీఫ్‌ సూపరింటెండెంట్‌ రాజేశ్వర్‌ పాల్గొన్నారు.

స్పీకర్‌ పదవికే వన్నె తెచ్చారు..

శాసనసభ సభాపతి పదవికి వన్నె తీసుకొచ్చిన గొప్ప నేత దుద్దిళ్ల శ్రీపాదరావు అని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. సోమవారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ మాజీ స్పీకర్‌ దుద్దిల్ల శ్రీపాదరావు జయంతిని పురస్కరించుకొని కలెక్టరేట్‌లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీపాదరావు తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని కొనియాడారు. శ్రీపాదరావు ఆశయాలను యువత స్ఫూర్తిగా తీసుకుని సమాజ సేవకు తోడ్పడాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, ఆర్డీఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement