
అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టండి
ఎక్కడా లేని విధంగా నాలలు, కందకాలు కబ్జాకు గురయ్యాయి. అధికారులు, పాలకుల ఊదాసీనత వల్లే అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలు పెరిగాయి. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అక్రమ నిర్మాణాలు, కబ్జాలపై చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించాలి. తద్వారా రానున్న రోజుల్లో ఎదుర్కొనే సమస్యల పరిష్కారంపై స్పష్టత వస్తుంది. ఇప్పటికై నా మేల్కొనపోతే భవిష్యత్‌లో త్రీవ ఇబ్బందులు పడాల్సి వస్తుంది. – శ్రీధర్, గద్వాల
దారులు అధ్వానం
పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు కాలనీ అంతర్గత రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. ఎక్కడపడితే అక్కడ గుంతలు ఏర్పాడ్డాయి. నిత్యం గుంతల రోడ్లపై ప్రయాణం అంటే సాహసం చేయాల్సి వస్తోంది. ప్రమాదాలు చోటుచేసుకుంటున్న అధికారుల పట్టనట్లుగా ఉన్నారు. మరమ్మతులు సైతం మొక్కుబడిగా చేపట్టి చేతులు దులుపుకొంటున్నారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రహదారులను మెరుగుపర్చాలి.
– గోపాల్, గద్వాల

అక్రమ నిర్మాణాలపై చర్యలు చేపట్టండి