ఏర్పాట్లు పూర్తి చేసిన కార్మికశాఖ
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికలకు వరంగల్ రీజియన్ పరిధిలో కార్మికశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 9న ఉదయం 5నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 3,042 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇప్పటికే డిపోల వారీగా, రీజినల్ మేనేజర్ కార్యాలయంలో పోలింగ్ బూత్‌లు గుర్తించారు. ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, సిబ్బందిని నియమించారు. బ్యాలెట్స్ బాక్స్‌లు సమకూర్చుకోవడంతో పాటు బ్యాలెట్ పేపర్‌లు సిద్ధం చేశారు. నేడు (గురువారం) హనుమకొండలోని జిల్లా కార్యాలయాల భవన సముదాయంలోని కార్మిక శాఖ కార్యాలయంలో సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేయనున్నారు.
పోలింగ్ పర్యవేక్షకులుగా
అసిస్టెంట్ లేబర్ కమిషనర్లు
మహబూబాబాద్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ వెంకట్‌రెడ్డి మహబూబాబాద్, భూపాలపల్లి, తొర్రూరు డిపోల్లోని పోలింగ్ స్టేషన్‌లను, వరంగల్ అసిస్టెంట్ లేబర్ కమిషనర్ భార్గవ్ వరంగల్–1, వరంగల్–2 హనుమకొండ, ఆర్‌ఎం ఆఫీస్, జనగామ, పరకాల, నర్సపేట, పరకాల డిపోల్లోని పోలింగ్ స్టేషన్‌లను పర్యవేక్షిస్తారు.
ప్రతీ ఓటరుకు రెండు ఓట్లు..
● ప్రతీ ఓటరు (కార్మికుడు) రెండు ఓట్లు వేయాలి. క్లాస్–3 (రాష్ట్ర), క్లాస్–6 (రీజియన్)కు వేర్వేరుగా ఓట్లు వేయాల్సి ఉంటుంది.
● డ్యూటీలో ఉండి 9న పోలింగ్‌లో పాల్గొనే అవకాశం లేని కార్మికులకు ఈ నెల 15, 16 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం కల్పించారు.
● పోలింగ్ కోసం మొత్తం 39 మంది సిబ్బందిని నియమించారు. ఇందులో 10 మంది ప్రిసైడింగ్ అధికారులుండగా, మిగతా వారిలో అసిస్టెంట్ ప్రిసైడింగ్ అఫీసర్, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.
● పోలింగ్ అనంతరం కౌంటింగ్ నిర్వహిస్తారు. కా నీ, ఫలితాలు అధికారికంగా విడుదల చేయరు.
● పోస్టల్ బ్యాలెట్‌ను ఈ నెల 15, 16 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు డిపోలో కేటాయించిన బాక్స్‌లో వేయాలి.
● వీటిని ఈ నెల 16న మధ్యాహ్నం 2 గంటల తర్వాత కౌంటింగ్ చేస్తారు. తుది ఫలితాలు 17న ప్రకటిస్తారు.
ముగిసిన ఎన్నికల ప్రచారం...
టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల ప్రచారం బుధవారంతో ముగిసింది. ఈ నెల 18న కార్మిక శాఖ గుర్తింపు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అప్పటినుంచి యూనియన్‌లు ఎన్నికల ప్రచారం చేపట్టాయి. కార్మిక యూనియన్ ప్రధాన సంఘాలతోపాటు ఆయా పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్మిక సంఘాల రాష్ట్ర, రీజియన్ నాయకులు డిపోల వారీగా ప్రచారం నిర్వహించారు. గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డారు. చివరగా ఈ నెల 6న తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్, ఎస్‌డబ్ల్యూఎఫ్ ఐక్య కూటమి బహిరంగ సభ నిర్వహించగా, ఎంప్లాయీస్ యూనియన్, ఎన్‌ఎంయూ, టీఎంయూ ఐక్య కూటమి బుధవారం బహిరంగ సభ నిర్వహించింది. కార్మికులకు ఏమేమి చేస్తామో వివరించాయి. వరంగల్ రీజియన్‌లో రెండు ఐక్య కూటమిల మధ్య ముఖాముఖి పోటీ నెలకొనగా ఓటర్ల మద్దతు పొందేందుకు తీవ్రంగా శ్రమించాయి. విజయంపై ఎవరికివారు ధీమాతో ఉన్నారు.
డిపోల వారీగా ఓటర్లు ఇలా..
472
258
557
400
219
280
242
262
302
50
పోలింగ్ ఇలా..
9న ఉదయం 5నుంచి
సాయంత్రం 6 గంటల వరకు
పోలింగ్ అనంతరం కౌంటింగ్
ఈ నెల 15, 16న పోస్టల్ బ్యాలెట్
క్లాస్–3కి వైట్ పేపర్ బ్యాలెట్
క్లాస్–6కు లైట్ గ్రీన్ బ్యాలెట్
17న తుది ఫలితాల ప్రకటన
ముగిసిన ఎన్నికల ప్రచారం
వరంగల్ రీజియన్‌లో మొత్తం
3,042 ఓట్లు
9 డిపోల్లో ఒక్కో బూత్, ఆర్‌ఎం
కార్యాలయంలో మరొకటి ఏర్పాటు
39 మంది పోలింగ్ సిబ్బంది
నియామకం


