‘చేయూత’ అందేనా? | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’ అందేనా?

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

పకడ్బందీగా పరిశీలన

పింఛన్ల కోసం

అభాగ్యుల ఎదురుచూపులు

భూపాలపల్లి రూరల్‌: ప్రభుత్వం అర్హులైన వారికి కొత్తగా దసరా నుంచి చేయూత పథకం కింద పింఛన్లు అందించేందుకు కసరత్తు చేస్తుండడంతో ఈసారైనా తమకు పింఛన్లు వస్తాయన్న ఆశతో అర్హులైన వారు దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారిగా చేయూత పింఛన్లు అందిస్తుండటంతో జిల్లాలో చాలా మంది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఆయా దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అర్హుల జాబితాను సిద్ధం చేశారు.

387 మంది దరఖాస్తుల తిరస్కరణ

చేయూత పింఛన్ల కోసం ఆగస్టు 9 నుంచి సెప్టెంబర్‌ 16వ తేదీ వరకు ప్రభుత్వం దరఖాస్తులకు అవకాశం కల్పించడంతో జిల్లాలో 8,037 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలో 7, 429 మంది అర్హులు కాగా 387 మంది దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. తనిఖీలో 188 మంది హోల్డ్‌లో ఉంచారు. 33 మందివి పెండింగ్‌లో ఉంచారు. అనంతరం ఎంపీడీఓల వద్దకి రాగా 298 రిజెక్ట్‌ కాగా 188, హోల్డ్‌లో ఉండగా, 33 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. మొత్తం 7,088 దరఖాస్తులు అప్రూవల్‌ చేశారు. ఇప్పటికే జిల్లాలో 53,739 మంది పింఛన్‌ లబ్ధిదారులు ఉన్నారు. దసరా పండుగ సందర్భంగా కొత్తవారికి పింఛన్లు మంజూరు చేస్తే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరగనుంది.

క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి

చేయూత పింఛన్లకు లబ్ధిదారులు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన గతనెల 16తో ముగిసింది. జిల్లావ్యాప్తంగా అధికారుల బృందాలు క్షేత్రస్థాయిలో దరఖాస్తుదారుల వద్దకు నేరుగా వెళ్లి పరిశీలన చేశాయి. 14 ప్రశ్నలతో కూడిన వివరాలను సరిచూసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. చేయూత యాప్‌లో అర్హుడా? కాదా అన్న విషయాన్ని టిక్‌ చేసి లోకేషన్‌ ఫొటోతో సహా అప్‌లోడ్‌ చేశారు. జిల్లాలో ఈసారి పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడంతో పరిశీలన అనంతరం ఎంతమందికి పింఛన్లు వస్తాయోనన్న విషయం అధికారులు వెల్లడించలేదు. దీంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు.

చేయూత దరఖాస్తుల పరిశీలన పకడ్బందీగా పూర్తయింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హుల జాబితా త్వరలో ప్రకటిస్తాం.

– బాలకృష్ణ, డీఆర్‌డీఓ

పూర్తయిన దరఖాస్తుల పరిశీలన

జిల్లాలో దరఖాస్తు చేసుకున్నవారు 8,037

తిరస్కరణకు గురైనవి 387

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement