భూపాలపల్లి రూరల్: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్, ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రాంచ్‌లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వరకు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు ఇంటర్మీడియట్, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి సుకీర్తి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను ఈనెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు హనుమకొండలోని షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందించాలన్నారు. పూర్తి వివరాలకు 9160606862 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
విజయగణపతి ఆలయ రాతి పనులు షురూ
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరం దేవస్థానం పునర్నిర్మాణం పనుల్లో భాగంగా విజయ గణపతి ఆలయం, ప్రధాన గర్భగుడి ఆలయ పునాది పనులు పూర్తయ్యాయి. బుధవారం విజయగణపతి, గర్భగుడికి అర్చకులు పూజలు చేసి ఒక్కో కృష్ణశిలను పునాదిపై ఏర్పాటు చేశారు. దేవాదాయ, ఆర్‌అండ్‌బీ శాఖలు ఈ పనుల వివరాలు, విషయాలు బయటకు రాకుండా గోప్యత పాటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేటి పాదయాత్రను
విజయవంతం చేయాలి
భూపాలపల్లి రూరల్: రాజ్యాంగ పరిరక్షణకు ఇండియా కూటమి కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐ (ఎంఎల్) పార్టీల ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రను విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కరుణాకర్ తెలిపారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కూటమి పార్టీల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు (గురువారం) ఉదయం 9 గంటలకు జిల్లాకేంద్రంలో రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు, వివిధ సంఘాల నాయకులు హాజరై విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యుడు సోతుకు ప్రవీణ్ కుమార్, నాయకులు పాల్గొన్నారు.
బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్‌గా అరుణ్
గోవిందరావుపేట: మండల పరిధిలోని చల్వా యి 5వ బెటాలియన్ టీజీఎస్పీ నూతన అసిస్టెంట్ కమాండెంట్‌గా ఆర్.అరుణ్ రాజ్‌కుమా ర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో అలైడ్ ఫోర్స్‌లో విధులు నిర్వహించిన ఆ యన బెటాలియన్‌కు అసిస్టెంట్ కమాండెంట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా బెటాలియన్ క మాండెంట్ సీవీ.లక్ష్మీకాంతరావు నూతన అసిస్టెంట్ కమాండెంట్‌కు మొక్క అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. బెటాలియన్ విధుల నిర్వహణలో సమన్వయంతో పనిచేస్తూ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించా రు. అనంతరం అరుణ్ బెటాలియన్ అఽధికారులను పరిచయం చేసుకున్నారు.
నకిలీ లోన్ ఆఫర్లపై
అప్రమత్తం
ములుగు రూరల్: నకిలీ లోన్ ఆఫర్లపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ సూచించారు. ఈ మేరకు బుధవారం సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించి వాల్ పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ పోలీస్‌శాఖ చేపట్టిన ఫ్రాడ్ కా పుల్‌స్టాప్ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. తక్షణం, తక్కువ వడ్డీ రుణాలు, నిమిషాల్లో లోన్ మంజూరు అంటూ సైబర్ నేరగాళ్లు ప్రజలను ఆకర్షించి జీఎస్టీ, లోన్‌ప్రాసింగ్ ఫీజు పేరుతో ముందుగా డబ్బులు చెల్లించాలని కోరుతున్నారని తెలిపారు. ప్రజలు అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, మెసేజ్‌లకు స్పందించకూడదని వివరించారు. ఇతరులకు బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, పాస్‌వర్డ్‌లు తెలుపరాదని వెల్లడించారు. సైబర్ మోసాల భారిన పడితే వెంటనే 1930 కాల్ చేయాలని సూచించారు. ఫిర్యాదు చేస్తే డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ కిశోర్‌కుమార్, సీఐ సురేశ్‌కుమార్, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ ప్రతాప్, వెంకటాపురం(ఎం) ఎస్సై చల్లా రాజు, డీసీఆర్బీ ఎస్సై వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.


