భూపాలపల్లి రూరల్: ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితుల్లో యాసంగి సీజన్‌లో పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా, మండల, ఉద్యాన వన శాఖ అధికారులతో మాట్లాడారు. ఏ పంటలు వేయాలో ముందుగానే రైతులకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు ఏఈఓలతో సమావేశం నిర్వహించారు. యాసంగి పంటలకు సంబంధించి తక్కువ నీటితో పండే పంటలను వేసుకునేలా గ్రామాల్లోని రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి తిరుపతి, అధికారులు సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


