జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలి

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

● ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని పుష్ప గార్డెన్స్‌లో నిర్వహించనున్న మెగా జాబ్‌ మేళాను సద్వినియోగించుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్‌ రాహుల్‌శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి ముందస్తు ఏర్పాట్లను పరిశీలించారు. అఽధికారులకు టెంట్లు, సౌండ్‌ సిస్టం ఏర్పాటు, భోజన సౌకర్యాలు, తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడుతూ తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ మేళాలో పలు కంపెనీలు పాల్గొంటాయని, పదో తరగతి నుంచి పీజీ, పీహెచ్‌డీ, ఐటీఐ, పాలిటెక్నిక్‌, బీటెక్‌, ఎంటెక్‌, బీ ఫార్మసీ, డీఫార్మసీ తదితర విద్యార్హతలు కలిగిన యువత పాల్గొనవచ్చన్నారు. అభ్యర్థుల కోసం 15 రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలి పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచి త రవాణా, టిఫిన్‌ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు విద్యార్హతల ధ్రువపత్రాలతో ఉదయం 7 గంటలకు మేళా ప్రాంగణానికి చేరుకోవాలని సూచించారు. జాబ్‌మేళాకు యువత పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ ర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ విజయలక్ష్మి, కేటీపీపీ సీఈ శ్రీప్రకాష్‌, సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ బుర్ర కొమురయ్య, వైస్‌ చైర్మన్‌ అంబాల శ్రీనివాస్‌, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement