ధాన్యం కొనుగోలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు చేయాలి

Jun 21 2026 12:37 AM | Updated on Jun 21 2026 12:37 AM

యూరియాను నేరుగా రైతులకు

అందించాలి

మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి: రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేయాలని, యాప్‌ ద్వారా కాకుండా రైతులకు నేరుగా యూరియా అందించాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో శనివారం జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్‌ అందించాలన్నారు. రైతుల పట్ల కాంగ్రెస్‌ సర్కారు అవలంభిస్తున్న ద్వంద వైఖరిని మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు కటకం జనార్దన్‌, పార్టీ మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ గండ్ర హరీశ్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.

‘సర్‌’పై అవగాహన..

‘సర్‌’(స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌)పై జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలకు శనివారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రాబోవు రోజుల్లో అనుసరించాల్సిన వ్యూహాత్మక అడుగులు, పార్టీ డిజిటల్‌ సభ్యత్వ నమోదుపై మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement