నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి
గణపురం: రైతులను ఎలాంటి ఇబ్బందులకు గురి చేయకుండా ఏఫ్‌ఏక్యూ ప్రమాణాల మేరకే ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అ ధికారి కిరణ్‌కుమార్ అన్నారు. గాంధీనగర్, బుద్దా రం, గణపురంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను సీఎస్‌సీ రాములు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధా న్యం కొనుగోలు చేసిన వెంటనే సంబంధిత మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం, బిల్లింగ్, రవాణా ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలన్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా బాధ్యతాయుతంగా పని చేయాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా చూడాలన్నారు.


