టీ–పోల్ యాప్‌లో ఎన్నికల సమాచారం
భూపాలపల్లి అర్బన్: గ్రామ పంచాయతీ ఎన్నిక సమాచారం టీ–పోల్ మొబైల్‌యాప్‌లో అందుబాటులో ఉన్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీ–పోల్ యాప్ ద్వారా ఓటర్ల పోలింగ్ కేంద్ర వివరాలు, ఓటర్ స్లిప్పుల నమోదు సమాచారం సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఓటర్ ఈ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఓటరు అవగాహన, ప్రజలు ప్రలోబాలకు గురికాకుండా స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించుకోవాలి
విద్యార్థులలో సైన్స్‌పై ఆసక్తిని పెంపొందించడంతో పాటు నాణ్యమైన విజ్ఞాన విద్యను అందించేందుకు ప్రథమ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్టెమ్ ఎడ్యుకేషన్ ఫర్ ఇన్నివేషన్ కార్యక్రమాన్ని అన్ని పాఠశాలల్లో అమలు చేయనున్నట్లు కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టర్ చాంబర్‌లో ప్రథమ్ ఫౌండేషన్ బృందంతో కలిసి, జిల్లాలోని పాఠశాలల్లో సైన్స్ బలోపేతానికి చేపట్టనున్న కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులకు సైన్స్ అంశాలపై అవగాహన పెంచేలా ఆన్‌లైన్ వీడియోలు, టీచర్లకు ప్రత్యేక గైడెన్స్, స్టెమ్ ఆధారిత బోధన విధానాలు అమలు చేయనున్నట్లు వివరించారు. ప్రథమ్ ఫౌండేషన్ ద్వారా అందించే స్టెమ్ ప్రోగ్రామ్‌ను జిల్లాలోని ప్రతి పాఠశాలలో సమర్థవంతంగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫౌండేషన్ అందించే బోధన సామగ్రి (మెటీరియల్) అన్ని పాఠశాలలకు చేరే విధంగా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాజేందర్, జిల్లా సైన్స్ అధికారి స్వామి, ఏఎంఓ విజయపాల్‌రెడ్డి, ప్లానింగ్ ఆఫీసర్ రాజగోపాల్, సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల రిసోర్స్ పర్సన్స్, ప్రథమ్ ఫౌండేషన్ బృంద సభ్యులు పాల్గొన్నారు.


