పోలీసులపై ఆకతాయిల జులుం
టేకుమట్ల: పోలీస్‌స్టేషన్ సమీపంలో పోలీసులపైనే ఆకతాయిలు జులుం ప్రదర్శించిన ఘటన చోటుచేసుకుంది. వైన్‌షాప్ సమీపంలో కొంతమంది యువకులు గురువారం టేకుమట్ల–ఆశిరెడ్డిపల్లి ప్రధాన రోడ్డుపక్కన మద్యం సేవిస్తున్నారు. విధుల్లో ఉన్న పోలీసులు అక్కడకు చేరుకుని ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది.. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. మద్యం మత్తులో కొంతమంది యువకులు పోలీసులపై ఎదురు తిరిగారు. ‘మా ఇష్టం’ అంటూ జులుం ప్రదర్శించారు. అంతటితో ఆగకుండా పోలీ సులే ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని వీడియోను సైతం ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో తీశాడు. అంతటితో ఆగని యువకులు హెడ్ కానిస్టేబుల్ ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేయడంతో స్వల్పంగా దెబ్బతిన్నది. దాంతో పోలీసులు యువకుడి సెల్‌ఫోన్ తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిపోయారు. అనంతరం యువకుడు అల్లకొండ రమేశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై దాసరి సుదాకర్ తెలిపారు.
యువకుడిపై కేసు నమోదు
పోలీస్‌స్టేషన్ సమీపంలోనే ఘటన


