ఎన్నికల నిర్వహణకు సన్నద్ధం
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల కోడ్ అమలు, ఎన్నికలు నిర్వహణ, శాంతిభద్రతలు తదితర అంశాలపై ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి కలెక్టర్ వివరాలు వెల్లడించారు. జి ల్లాలో 12 మండలాల్లో మూడు దశలుగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 248 గ్రామపంచా యతీలో 2,012 వార్డులు ఉన్నాయని, మూడు దశల్లో నామినేషన్ ప్రక్రియ స్వీకరణకు 77 క్లస్టర్లు ఏ ర్పాటు చేసినట్లు తెలిపారు. మొత్తం 3,02,147లక్ష ల మంది ఓటర్లున్నారని, పురుషులు 1,47,388 మంది, మహిళలు 1,54,744 మంది, ఇతరులు 15 మంది ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్‌లో 90306 32608 హెల్ప్‌డెస్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ.. మండలాల్లో బందోబస్తు పర్యవేక్షణకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశామన్నారు. 70 రూట్లుగా విభజించి పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య పోలింగ్ మెటీరియల్ తరలించనున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు సెన్సిటివ్, క్రిటికల్, నార్మల్ పోలింగ్ కేంద్రాలుగా విభజించి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు, ప్రజ లు.. నిబంధనలు పాటించాలని, ప్రచారాలకు అనుమతి తీసుకోవాలని సూచించారు. ఏదైనా ఉల్లంఘన జరిగితే 24 గంటలు పని చేసేలా ఏర్పాటు చేసిన పోలీస్ కంట్రోల్ రూమ్ 87126 58178 నెంబర్‌కు కాల్ చేయాలని అన్నారు.
ఏర్పాట్లు పూర్తి చేయాలి
జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాహుల్‌శర్మ తెలిపారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్‌హాల్‌లో బుధవారం మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై రిటర్నింగ్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నేడు(గురువారం) ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించి గ్రామ పంచాయతీ కార్యాలయం, గ్రామపంచాయతీ ప్రధాన కూడళ్లలో ప్రదర్శింపచేయాలన్నారు. నామినేషన్ల ప్రక్రియ ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుందని, 29వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించాలని, 30న నామినేషన్ల పరిశీలన, డిసెంబర్ 1వ తేదీన అప్పీళ్లు, 2న డిస్పోజల్, 3వ తేదీన ఉపసంహరణ ఉంటుందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు 25 మంది రిటర్నింగ్ అధికారులను నియమించామని తెలిపారు. ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు నామినేషన్ సెట్లు దాఖలు చేసేందుకు అవకాశం ఉందని, మొదటి విడతలో 4 మండలాల్లోని 82 గ్రామపంచాయతీల పరిధిలోని 712 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
నోడల్ అధికారుల నియామకం
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు వివిధ విభాగా లకు చెందిన జిల్లా స్థాయి అధికారులను నోడల్ అధికారులుగా నియమిస్తూ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి రాహుల్‌శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల సమయంలో అవసరమైన మాన వ వనరులు, రవాణా, బ్యాలెట్ బాక్సులు, శిక్షణ, మీడియా కమ్యూనికేషన్, ఫిర్యాదుల పరిష్కారం, వ్యయ పర్యవేక్షణ మొదలైన అంశాల్లో సమన్వయంతో విధులు నిర్వర్తించేలా ఈ నియామకాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.
పోస్టర్ ఆవిష్కరణ
అంతర్జాతీయ సీ్త్ర హింస వ్యతిరేక దినాన్ని పురస్కరించుకొని ‘స్టాప్ వైలెన్స్ ఎగైనెస్ట్ ఉమెన్’ పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ రాహుల్‌శర్మ ఆవిష్కరించారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. జిల్లా మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 16 రోజుల అవగాహన కార్యక్రమం నవంబర్ 25 నుంచి వచ్చే నెల 10వ తేదీ వరకు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎస్పీ సంకీర్త్, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డిప్యూటీ ట్రైనీ కలెక్టర్ నవీన్‌రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమ శాఖ అధి కారి మల్లీశ్వరి, జిల్లా మహిళా సాధికారత కేంద్రం ఇన్‌చార్జ్ కోఆర్డినేటర్ కృష్ణ, సురేష్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్ శర్మ


