నువ్వా.. నేనా..?
దృష్టి సారించిన ప్రధాన పార్టీలు..
తెరమీదకు వస్తున్న ఆశావహులు
భూపాలపల్లి: పల్లెల్లో నువ్వా.. నేనా.. అన్న రీతిలో పోరు సాగబోతుంది. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. తొలిదశ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కా నుండడంతో ‘స్థానికం’లో గెలుపు కోసం ప్రధాన రాజకీయ పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి.
బుజ్జగింపులు షురూ...
జిల్లాలో తొలి విడతలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం, కొత్తపల్లిగోరి, రేగొండ, మొగుళ్లపల్లి మండలాల్లోని 82 సర్పంచ్, 712 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. నేటి నుంచి నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో సర్పంచ్ స్థానాలకు దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే బుజ్జగింపుల పర్వం కొనసాగుతోంది. పోటీదారులు బరిలో నిలువకుండా ఉండేందుకు పలువురు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాక కుల, యువజన సంఘాలను మచ్చిక చేసుకొని విందులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా యువత, రైతులను ఆకర్షించుకునేందుకు ఆశావహులు పడరాని పాట్లు పడుతున్నారు. మరోవైపు 500 ఓట్ల వరకు ఉన్న చిన్నచిన్న గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవం చేసుకునేందుకు కొందరు యత్నిస్తున్నారు. ఇందుకోసం గ్రామంలో నెలకొన్న సమస్యల పరి ష్కారం కోసం సొంతగా డబ్బులు వెచ్చిస్తామని హా మీ ఇస్తున్నారు. అయినప్పటికీ పోటీదారులు అంగీ కరించకపోవడంతో సమరానికి సిద్ధమవుతున్నారు.
మొదటిసారి కుర్చీలో కూర్చునేదెవరో..
గత పంచాయతీ ఎన్నికల్లో జిల్లాలోని 241 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగగా, ఈసారి కొత్తగా ఏడు జీపీలు ఏర్పడ్డాయి. భూపాలపల్లి మండలంలోని గొర్లవీడు తండా, కొంపెల్లి తండా, కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి గోరి మండలంలో కొత్తపల్లి(కె), బాలయ్యపల్లి, మొగుళ్లపల్లిలో బద్ధంపల్లి, చిట్యాలలో రామచంద్రాపురం, టేకుమట్ల మండలంలో కలికోట గ్రామాలు.. పంచాయతీలుగా ఏర్పడ్డాయి. ఈ జీపీల్లో తొలి సర్పంచ్ స్థానంలో కూర్చునేది ఎవరనే దానిపై ఆసక్తి నెలకొంది.
పంచాయతీ ఎన్నికలపై ప్రధాన రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామీణ ఓట్లు కీలకం కానుండటంతో, తమ పార్టీ మద్దతుదారులు సర్పంచ్, వార్డు స్థానాలను కైవసం చేసుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఆయా పార్టీల నేతలు.. గెలుపు గుర్రాలను ఎంపిక చేసుకొని, వారికి మద్దతుగా ప్రచారం నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు బుధవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీసులో సమావేశాలు నిర్వహించడం గమనార్హం. మొదటిదశలో ఎన్నికలు జరగనున్న పంచాయతీలకు సంబంధించిన పార్టీల నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి దిశా నిర్దేశం చేశారు. నామినేషన్లు వేసిన అనంతరం ప్రజా మద్దతు ఉన్న వారిని గుర్తించి వారికి మాత్రమే మద్దతుగా నిలవనున్నట్లు తెలుస్తోంది.
పల్లెల్లో మొదలైన విందులు.. ఆకర్షణలు
మొదటి దశకు నేటి నుంచి
నామినేషన్ల స్వీకరణ
‘స్థానికం’లో గెలుపు కోసం
ప్రధాన పార్టీల యత్నాలు
నువ్వా.. నేనా..?
నువ్వా.. నేనా..?
నువ్వా.. నేనా..?


