రాజ్యాంగం దేశ పాలనా వ్యవస్థకు దిక్సూచి
కాటారం: మన రాజ్యాంగం పవిత్రమైన గ్రంథం అని దేశ పరిపాలన వ్యవస్థకు దిక్సూచిలా రాజ్యాంగం వ్యవహరిస్తుందని గురుకులం భూపాలపల్లి, ములుగు జిల్లాల రిజినల్ కోఆర్డినేటర్(ఆర్‌సీఓ) హరిసింగ్ అన్నారు. మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో బుధవారం రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజ్యాంగం ఆవశ్యకత, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గొప్పతనం గురించి విద్యార్థులకు వివరించారు. పలువురు విద్యార్థులు రాజ్యాంగం, అంబేడ్కర్ విశిష్టతను తెలియజేసేలా ఉపన్యాసాలు ఇచ్చి పాటలు పాడారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ మాధవి, వెంకటయ్య, బలరాములు, రాజబాబు, కృష్ణమాచారి, నీలిమ, స్వప్న, గోపాలకృష్ణ, శ్రవణ్, నరసింహ, సర్దార్‌సింగ్, పీడీ మహేందర్, పీఈటీ శ్రీనివాస్, కోచ్ వెంకటేశ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


