మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్–1 అధికారి
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్–1 అధికారి కొయ్యడ ఉదయ్‌కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం కలెక్టర్ రాహుల్‌శర్మను మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్కను అందించారు. మున్సిపాలిటీకి ప్రప్రథమంగా గ్రూప్–1 అధికారిని కేటాయించారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయ అనుబంధ దేవాలయంలో శ్రీసుబ్రహ్మణ్యషష్ఠి సందర్భంగా శ్రీసుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో విశేష అభిషేక పూజలను ఉపప్రధాన అర్చకులు పనకంటి ఫణీంద్రశర్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం ఉదయం శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామికి పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు తీర్ధప్రసాదం వితరణ చేశారు.ఈకార్యక్రమంలో ఈఓ మహేష్, జిల్లా గ్రంథాలసంస్ధ చైర్మన్ కోట రాజబాబు, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతిరెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
గణపురం: ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాత భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేశారని, దీనికి లోబడి దేశంలోని ప్రతీ వ్యవస్థ పని చేయాలని సీనియర్ సివిల్ జడ్జి న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాజ్ సూచించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం గాంధీనగర్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల పాఠశాలలో జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరైన మాట్లాడారు. రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. చదవు అనేది మనిషిని విజ్ఞానవంతుడిగా చేస్తుందని చదువు రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. కార్యక్రమంలో గవర్నమెంట్ ఫ్లీడర్ బొట్ల సుధాకర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీనివాస చారి, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ పుప్పాల శ్రీనివాస్, స్పెషల్ పీపీ విష్ణువర్ధన్ రావు, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
జేఏసీ ఆధ్వర్యంలో
నిరసన దీక్ష
భూపాలపల్లి అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓ నంబర్ 46కు వ్యతిరేకంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ సెంటర్‌లో నిరసన దీక్ష చేపట్టి రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్బంగా జేఏసీ జిల్లా కోఆర్డినేటర్ కొత్తూరి రవీందర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు 42 శాతం వాటా ప్రకటించి, కోర్టు ఆదేశాలతో నిలిపివేసిందన్నారు. రాజ్యాంగ నియామకాలకు లోబడి పొరపాటు లేకుండా చట్టాలను రూపోందించాల్సి ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పు వాయిదా పడడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓసీలకు అధికంగా సీట్లు కేటాయించే విధంగా బీసీలకు అన్యాయం చేసిందన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు రమేష్, రవికుమార్, భాస్కరచారి, శ్రీనివాస్, మల్లన్న, మహేష్, హరీష్, రాజేందర్‌లు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్–1 అధికారి
మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్–1 అధికారి
మున్సిపల్ కమిషనర్‌గా గ్రూప్–1 అధికారి


