ఆరోగ్యంపై అవగాహన ఉండాలి
గణపురం: బాలికలు, మహిళలకు వారి ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. బుధవారం మైలారం మహాత్మాజ్యోతిబాపూలే పాఠశాలలో గివ్ ఫర్ సొసైటీ సంస్థ ఆధ్వర్యంలో బాలికలకు ఉచిత నాప్ కిన్స్ పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, కలెక్టర్ రాహుల్‌శర్మతో కలిసి పాల్గొని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందన్నారు. నాప్‌కిన్స్‌ను ఉచితంగా పంపిణీ చేసిన ఫర్ గివ్ సంస్థ సత్యను అభినందించారు.ఎమ్మల్యే గండ్ర సత్యనారయణ రావు మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామన్నారు. కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి రుతు స్రావ సమస్యను ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, మహిళా సంక్షేమాధికారి మల్లేశ్వరి, ప్రిన్సిపాల్ స్వప్న తదితరులు పాల్గొన్నారు.
ఎంపీ కడియం కావ్య


