
జాతీయ జెండాకు ఆవిష్కరిస్తున్న ఎస్పీ
భూపాలపల్లి: ఎంతో మంది త్యాగాలతోనే తెలంగాణ ప్రజలకు స్వాతంత్య్రం సిద్ధించిందని, వారి సేవలు చిరస్మరణీయమని ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో సాయుధ పోలీసులచే ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు.
అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన వారి చిత్ర పటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ నరేష్‌కుమార్, భూపాలపల్లి డీఎస్పీ సంపత్‌రావు, ఆర్‌ఐ రత్నం, సీఐలు, డీపీఓ, సిబ్బంది పాల్గొన్నారు.
రామప్ప ఆలయం అద్భుతం
వెంకటాపురం(ఎం): రామప్ప టెంపుల్ బ్యూటీఫుల్‌గా ఉందని జర్మనీ దేశానికి చెందిన క్రిష్టియన్ స్లావిక్ కొనియాడారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన రామప్ప దేవాలయాన్ని ఆయన బుధవారం సందర్శించి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్ కుమార్ వివరించగా రామప్ప శిల్ప కళ సంపద బాగుందని కొనియాడారు.