
అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి
భూపాలపల్లి అర్బన్: అందరికి విద్య అందించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని కలెక్టర్ రాహుల్‌శర్మ ఆదేశించారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు, మరమ్మతులు వంటి మౌలిక సదుపాయాల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అంచనా నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన ప్రతిపాదనలు సమయానికి సమర్పిస్తే నిధుల మంజూరు సులభమవుతుందన్నారు. అందరికీ విద్య అందాలంటే పాఠశాలల్లో మంచి సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. విద్యార్థులకు అనువైన వాతావరణం కల్పించడంలో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, డీఈఓ రాజేందర్, మహిళా సంక్షేమ అధికారి మల్లీశ్వరి, డీఆర్‌డీఓ బాలకృష్ణ, డీపీఓ శ్రీలత, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ రామకృష్ణ, పీఆర్ డీఈలు సాయిలు, రవికుమార్, టీజీడబ్ల్యూఐడీసీ డీఈ జీవన్ పాల్గొన్నారు.
పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి..
భూపాలపల్లి పట్టణాన్ని పరిశుభ్ర పట్టణంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బతుకమ్మ, దసరా పండుగల ఏర్పాట్లు, పారిశుద్ధ్య కార్యక్రమాలు, ఇంటింటి నుంచి వ్యర్థాల సేకరణ తదితర అంశాలపై మున్సిపల్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా ప్రతి ఇంటి నుంచి వ్యర్థాల సేకరణ జరగాలని వార్డు అధికారులు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పారిశుద్ధ్య కార్యక్రమాలపై ప్రత్యేక ఫోకస్ చేయాలని సూచించారు. వార్డు అధికారులు నిత్యం వార్డుల్లో పర్యటిస్తూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వన మహోత్సవంలో ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేయాలని, పంపిణీ వివరాలు రిజిస్టర్‌లో నమోదు చేయాలని తెలిపారు. ఖాళీగా ఉన్న ఇంటి స్థలాలు పరిశుభ్రం చేయాల్సిన బాధ్యత స్థల యజమానులదేనన్నారు. దుకాణాల ముందు వ్యర్థాలు వేస్తే జరిమానా విధించాలని తెలిపారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగించకుండా అవగాహన కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని అన్నారు. ఇంటి పన్నుల వసూలు నూరు శాతం జరగాలని తెలిపారు. పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ పరిధిలో చిన్నారుల కోసం పార్కు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం, ఆడిటోరియం, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. ఈ నెల 21వ తేదీ నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాల్లో మహిళలు బతుకమ్మలు ఆడే ప్రాంతాలను గుర్తించి పారిశుద్ధ్య కార్యక్రమాలు, వి ద్యుత్ సౌకార్యం కల్పించాలని సూచించారు. బతుకమ్మ నిమజ్జనం సందర్భంగా ఘాట్ వద్ద ఏర్పాట్లు చేయాలని స్పష్టంచేశారు. 30వ తేదీన జరిగే సద్దుల బతుకమ్మ, 2వ తేదీన జరిగే దసరా వేడుకలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చే అవకాశం ఉన్నందున పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, ఏఈ మానస, డీపీఓ సునీల్ పాల్గొన్నారు.
పనులను పరిశీలించిన కలెక్టర్
భూపాలపల్లి రూరల్: భూపాలపల్లి పట్టణంలోని 16వ వార్డు రామ్ నగర్ సుభాష్ కాలనీలో నిర్మిస్తున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ ప్రాథమిక ఉప ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ, అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, కమిషనర్ బిర్రు శ్రీనివాస్ సందర్శించి పనులను పరిశీలించారు.ఈ సందర్భంగా వార్డు మాజీ కౌన్సిలర్ దాట్ల శ్రీనివాస్ మరికొన్ని నిధులు కేటాంచాలని కలెక్టర్‌ను కోరారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ

అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి