
యంత్రాలు, పరికరాల కొనుగోలుకు నివేదికలు
భూపాలపల్లి అర్బన్: ఏరియాలోని వివిధ గనులల్లో కావాల్సిన యంత్రాలు, పరికరాల కొనుగోలుకు నివేదికలు అందించాలని జీఎం(సీపీపీ) మనోహర్, జీఎం(యూజీ–మైన్స్) రఘురామారెడ్డి తెలిపారు. ఏరియా జీఎం రాజేశ్వర్‌రెడ్డితో కలిసి గురువారం ఏరియాలోని వివిధ విభాగాల అధికారులతో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ప్రణాళిక, వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను గనులకు, ఓపెన్‌కాస్ట్‌లకు కావలసిన యంత్రాలు, యంత్ర సామగ్రి, ఎలక్ట్రికల్ మెషినరీ, సర్వీస్ కెపాసిటర్స్ ప్లాంట్, మిషినరీ పనిముట్లు కావలసిన సదుపాయాలపై పలు సూచనలు, సలహాలు చేశారు. బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలకు అనుగుణంగా పనిచేసి నిర్దేశిత ఉత్పత్తి లక్ష్యాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జీఎంలు సూచించారు. ఉపరితల, భూగర్భ గనుల్లో యంత్ర పరికరాల అవసరాలు ఉన్నట్లయితే వివరాలను అధికారులకు అందజేయాలని సూచించారు. ఈ సమావేశంలో కార్పొరేట్ అఽధికారులు వెంకయ్య, దిలీప్‌కుమార్, చంద్రశేఖర్, నటరాజన్, ఏరియా అధికారులు కవీంద్ర, రవీందర్, శ్యామ్‌సుందర్, బుచ్చయ్య, జోతి, రవికుమార్ పాల్గొన్నారు.