
నేడు డయల్ యువర్ డీఎం
భూపాలపల్లి అర్బన్: భూపాలపల్లి ఆర్టీసీ డిపో పరిధిలో ఆర్టీసీ సమస్యలపై నేడు (శుక్రవారం) డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ ఇందు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన వ్యాపారస్తులు, ఉద్యోగులు, విద్యార్థులు డయల్ యువర్ డిపో మేనేజర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. 99592 26707 నంబర్‌కు ఫోన్ చేసి సలహాలు, సూచనలు అందజేయాలని కోరారు.
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం మద్దులపల్లి సమీపంలోని బల్జాపూర్ అటవీ ప్రాంతంలో జీవరాశుల కోసం అమర్చిన విద్యుత్ ఉచ్చులకు తగిలి ఒకరు మృతిచెందిన ఘటనలో కొంతమందిని పోలీసులు విచారిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున కాళేశ్వరం పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వారిలో కొంతమంది మళ్లీ విద్యుత్ ఉచ్చులు పెడుతున్నట్లు తెలిసింది.
టేకుమట్ల: మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయ విద్యార్థిని శ్వేత జిల్లాస్థాయి కబడ్డీ క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబర్చి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు కేజీబీవీ ఎస్‌ఓ నాగపూరి స్వప్న తెలిపారు. మొగుళ్లపల్లి మండల కేంద్రంలో గురువారం కబడ్డీ అసోసియేషన్–భూపాలపల్లి ఆధ్వర్యంలో సబ్ జూనియర్స్ క్రీడలను నిర్వహించారు. ఈ సందర్భంగా నాగపూరి స్వప్న మాట్లాడుతూ క్రీడలపై ఆసక్తి ఉన్న ప్రతీ విద్యార్థిని ప్రోత్సహిస్తూ రాష్ట్రస్థాయికి ఎంపికయ్యేందుకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రాష్ట్రస్థాయికి ఎంపికై న విద్యార్థినిని అభినందించారు. ఆమె వెంట పీఈటీ అనిత, ఉపాధ్యాయులు ఉన్నారు.
కాటారం: కాటారం మండలం విలాసాగర్ మానేరు నుంచి అనుమతి లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లను గురువారం బయ్యారం క్రాస్ వద్ద పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. మానేరు వాగు నుంచి భూపాలపల్లికి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారం మేరకు నిఘా పెట్టి పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. ట్రాక్టర్లను ఆపి పట్టుకోగా అనుమతులు లేకపోవడంతో పాటు ట్రాక్టర్లకు సరైన ధృవీకరణ పత్రాలు, డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్‌లు లేవని గుర్తించినట్లు ఎస్సై పేర్కొన్నారు. ట్రాక్టర్లతో పాటు ఇసుక లోడింగ్‌కు సహకరించిన ఎనిమిది ట్రాక్టర్లను డ్రోజర్లను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కాళేశ్వరం: రాష్ట్ర ప్రభుత్వ క్రీడా పాఠశాలకు మహదేవపూర్ మండలం కాళేశ్వరం గ్రామానికి చెందిన విద్యార్థులు ఎండీ అఫాన్, నీలం శ్రీవంత్ ఎంపికయ్యారు. అఫాన్ 5వ తరగతిలో ఆదిలాబాద్, శ్రీవంత్ హైదరాబాద్‌లోని క్రీడా పాఠశాలల ప్రవేశానికి ఎంపికై నట్లు తల్లిదండ్రులు రజాక్, శ్రీకాంత్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వీరిద్దరు జూలై 26న హైదరాబాద్‌లోని హకీంపేటలో ఈవెంట్స్‌లో పాల్గొని ఎంపికై నట్లు పేర్కొన్నారు. కాళేశ్వరం గ్రామానికి చెందిన కీర్తి శ్రీనివాస్ శిక్షణలో ఇప్పటి వరకు 10 మంది విద్యార్ధులు ఎంపికయ్యారు. వీరికి పలువురు గ్రామస్తులు, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
భూపాలపల్లి రూరల్: మేదరు కులస్తులను బీసీఏ నుంచి ఎస్టీ జాబితాలో చేర్చాలని మేదరి సంఘం జిల్లా అధ్యక్షుడు గైని రమేష్ ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచ వెదురు దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమేశ్ మాట్లాడుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మాత్రమే బీసీ ఏలో ఉన్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా ఇన్‌చార్జ్ రేపాల నరసింహ రాములు తదితరులు పాల్గొన్నారు.

నేడు డయల్ యువర్ డీఎం

నేడు డయల్ యువర్ డీఎం