
పెరటి కోళ్ల పెంపకంతో ఆర్థికాభివృద్ధి
ఎస్‌ఎస్‌తాడ్వాయి: పెరటి కోళ్ల పెంపకంతో ఆర్థికాభివృద్ధి సాధించవచ్చని సెర్ప్ టీజీ ఐఎల్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ జయరాం అన్నారు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మండల పరిధిలోని కన్నెపల్లిలో గురువారం టీజీఐఎల్పీ తెలంగాణ ఇన్ క్యూసివ్ లవ్లీహుడ్ కార్యక్రమంలో భాగంగా పెరటి కోళ్ల పెంపకంపై స్వయం సహాయక సంఘాల మహిళలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు జీవనోపాధి కల్పించేందుకు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం పెరటి కోళ్ల పెంపకం చేపట్టాలన్నారు. ఆసక్తి గల లబ్ధిదారులకు పెంపకంలో మెళకువలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ టీజీ ఐఎల్పీ జీవనోపాదుల విభాగం అధికారులు భవ్య లోకేష్, వాసన్, ఎన్‌జీవో సభ్యులు లక్ష్మణ్, నరసింహులు, డీఆర్‌డీఏ డీపీఎం రాజు, టీజీఐఎల్పీ జిల్లా కోఆర్డినేటర్ వెంకన్న, తాడ్వాయి ఏపీఎం కిషన్, సీసీ భద్రయ్య, తాడ్వాయి కోఆర్డినేటర్ యాదగిరి, కన్నాయిగూడెం మండలం పీజీ ఐఎల్పీ కోఆర్డినేటర్ శ్రీకాంత్ పాల్గొన్నారు.
సెర్ప్ టీజీఐఎల్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్
జయరాం