
రైతులు సూచనలు పాటించాలి
కాటారం: రైతులు పంటల సాగులో వ్యవసాయశాఖ ద్వారా అందిస్తున్న సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడి సాధించాలని వరంగల్ వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త వీరన్న, విత్తనోత్పత్తి శాస్త్రవేత్త వెంకన్న సూచించారు. కాటారంలో రైతులు సాగుచేస్తున్న పత్తి, వరి పంటలను గురువారం శాస్త్రవేత్తల బృందం సభ్యులు సందర్శించారు. పంట సాగు విధానం, ఎరువులు, పురుగు మందుల వాడకం, సాగు యజమాన్య పద్ధతులు తదితర అంశాలపై ఆరా తీశారు. పంటలపై వచ్చే పురుగులు, తెగుళ్లకు సంబంధించిన నివారణ, ముందు జాగ్రత్త చర్యలను రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు ఓంప్రకాశ్, రమ్య, ఏఈఓలు రాజన్న, అస్మ, మౌనిక పాల్గొన్నారు.