
స్లో!
న్యూస్‌రీల్
సాగని సర్వే..
సర్వే ఎంత అయిందంటే.. (ఎకరాల్లో)
శుక్రవారం శ్రీ 19 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025
మొబైల్ యాప్‌లో పంటల నమోదు
కాళేశ్వరం: జిల్లావ్యాప్తంగా డిజిటల్ క్రాప్ సర్వే నెమ్మదిగా నడుస్తోంది. ప్రతి క్లస్టర్‌లో రెండువేల ఎకరాల్లో సర్వే చేయాల్సి ఉండగా.. కేవలం ప్రారంభించి వదిలేసిన పరిస్థితి ఉంది. యూరియా పంపిణీలో వ్యవసాయశాఖ అధికారులు ఉంటుండడం కూడా సర్వేకు ఆటంకంగా మారింది. గడువులోపు సర్వే పూర్తికావడం కూడా కష్టంగానే మారింది. జిల్లావ్యాప్తంగా 12 మండలాల్లో మొత్తం 450 క్లస్టర్లలో 2.36 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తుండగా.. ఇప్పటివరకు 39,490 ఎకరాల్లో మాత్రమే సర్వే పూర్తయింది.
క్షేత్రస్థాయిలో పంటల పరిశీలన..
జిల్లాలో రైతుల వారీగా పంట నమోదు (డిజిటల్ క్రాప్ బుకింగ్) నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించి విధివిధానాలను ఖరారు చేసింది. వ్యవసాయ విస్తరణ అధికారులు క్లస్టర్ల వారీగా క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి మొబైల్ యాప్ ఫొటోలతో సహా వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి క్లస్టరులో రెండువేల ఎకరాల్లో డిజిటల్ క్రాప్ సర్వే చేయాలని ఆదేశాలు జారీచేసింది. క్లస్టర్ పరిధిలో పురుష వ్యవసాయ విస్తరణ అధికారులు రెండు వేల ఎకరాలు, మహిళా ఏఈఓలు 1,800 ఎకరాలు డిజిటల్ సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జిల్లాలో సీజన్ల వారీగా ఏటా ప్రభుత్వం పంటల సమగ్ర సర్వే చేస్తుంది. వ్యవసాయ సిబ్బంది పంట పొలాలను సందర్శించకుండా రైతులను అడిగి వివరాలు సేకరిస్తుండడంతో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాల సమయంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం డిజిటల్ క్రాప్ సర్వేకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ సర్వే చేయాలంటే తప్పనిసరిగా పంట పొలాన్ని విస్తరణ అధికారులు సందర్శించాల్సి ఉంటుంది.
యూరియా పంపిణీతో ఆలస్యం..
యూరియా కొరత నేపథ్యంలో వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతులకు పంపిణీ చేస్తున్నారు. దీంతో డిజిటల్ క్రాప్ సర్వేను ఏఈఓలు చేయడంలో ఆలస్యం జరుగుతుంది. జిల్లా అధికారులతో పాటు వ్యవసాయాధికారులు ఎరువుల దుకాణాలపై ప్రత్యేకంగా నజర్‌తో వారి నుంచి రైతులకు అందేలా చర్యలు చేపట్టారు. దీంతో సర్వే చేయడం ఈ నెలాఖరు వరకు పూర్తిచేయాలని గడువు ఉన్నా సాధ్యం కాని పరిస్థితులు నెలకొన్నట్లు తెలిసింది.
నమోదు ఇలా..
ప్రభుత్వం సన్న ధాన్యానికి బోనస్ ఇస్తుండడంతో వరిలో ఏ విత్తన రకం వేశారనేది తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది. రైతు పేరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు నమోదు చేయాలి. రైతుల మొబైల్‌లో ఎన్ని ఎకరాల్లో పంట వేశారనే సమాచారం మెసేజ్ రూపంలో చేరేలా ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు సర్వే నంబరు వారీగా పంట పొలాన్ని సందర్శించి వివరాలను నమోదు చేయడంతో పాటు ఫొటో తీసి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. పంట సాగు లేకపోతే నో క్రాప్ అని నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. అక్టోబరు 25 నాటికి క్రాప్ బుకింగ్ పూర్తిచేసి 27న గ్రామపంచాయతీల్లో వివరాలు ప్రదర్శించాలి. పంటల వివరాల నమోదులో తప్పులుంటే ఏ ఈఓ దృష్టికి తీసుకెళ్లాలి. మార్పులు, చేర్పుల అనంతరం నవంబరు 5న జాబితా ప్రదర్శిస్తారు.
ప్రభుత్వ ఆదేశాలతో గడువులోగా క్రాప్ బుకింగ్ చేయాలని ఆదేశాలు ఉన్నాయి. నిబంధనల మేరకు సర్వే చేయాలని వ్యవసాయ విస్తరణ అధికారులకు ఆదేశాలు అందజేశాం. ఇప్పటికే ఏఈఓలు మండలంలో క్రాప్ బుకింగ్ సర్వే చేస్తున్నారు. గడువులోగా క్రాప్ బుకింగ్ సర్వే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. యూరియా పంపిణీతో సర్వేలో కాస్త ఆలస్యం జరుగుతోంది.
– జాడి బాబురావు, జిల్లా వ్యవసాయ అధికారి
మహదేవపూర్ మండలంలో 16వేల ఎకరాలకు వెయ్యి ఎకరాలు.. మొగుళ్లపల్లి మండలంలో 7,600 ఎకరాలకు 3,200 ఎకరాలు, రేగొండలో 10వేల ఎకరాలకు 2వేల ఎకరాలు, చిట్యాలలో 9500 ఎకరాలకు 4800 ఎకరాల్లో ఇప్పటి వరకు అధికారులు డిజిటల్ సర్వే పూర్తిచేశారు. మిగతా మండలాల్లోనూ సర్వే చాలా నెమ్మదిగా సాగుతోంది.
ప్రతి క్లస్టర్‌లో రెండువేల ఎకరాల్లో సర్వే
యూరియా పంపిణీతో ఆటంకం
గడువులోగా కష్టమే..
పంట సాగు సర్వేఅయింది
పత్తి 98,260 18,571
వరి 1,14,653 20,875
మిర్చి 22,000 –
మొక్కజొన్న 253 34
కందులు 38 5
పెసర 78 5

స్లో!

స్లో!

స్లో!