
మెరుగైన వైద్యసేవలందించాలి
చిట్యాల: మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు మెరుగైన వైద్యసేవలందించాలని రాష్ట్ర ట్రైకార్ చైర్మన్ డాక్టర్ బెల్లయ్యనాయక్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని సివిల్ ఆస్పత్రిలో జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్వస్థ్ నారీ..సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని కలెక్టర్ రాహుల్‌శర్మ, ఎమ్మెల్యే సత్యనారాయణరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణే కుటుంబ ఆరోగ్యానికి పునాది అన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరోగ్య క్యాంపులు నిర్వహించి మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టలని సూచించారు. ప్రజల సహకారంతో విజయవంతం చేయాలన్నారు. అలాగే మండలంలోని జూకల్ గ్రామంలోని రైతువేదికలో జిల్లా సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో పోషణ మాసో త్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాని కి ముఖ్యఅతిథులుగా ఎమ్మెల్యే గండ్ర సత్యనా రాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మలు హాజరై గర్భి ణులు, బాలింతలు, చిన్నారులకు సమయానికి పోషకాహారం అందించడం ద్వారా ఆరోగ్యాన్ని కా పాడుకోవచ్చన్నారు. తిర్మలాపూర్‌లో చందర్‌కు రూ.1.90లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కును బెల్లయ్యనా యక్ అందించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజయలక్ష్మీ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి, జిల్లా వైద్యాధికారి మధుసూదన్, ఆస్పత్రి సూపరింటెండెంట్ శ్రీకాంత్, తహసీల్దార్ ఇమామ్‌బాబా, అధికారులు పాల్గొన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలు..
భూపాలపల్లి రూరల్:సాంకేతిక పరిజ్ఞానం విశ్వకర్మతోనే మొదలైందని ట్రైకార్ చైర్మన్ బెల్లయ్య నాయక్ అన్నారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విశ్వకర్మ జయంతి వేడుకలో శ్రీ విరాట్ విశ్వకర్మ భగవానుడి చిత్రపటానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరేలతో పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బెల్లయ్యనాయక్ మాట్లాడుతూ క్రీస్తు పూర్వం వేల సంవత్సరాల క్రితం రచించిన వేదాల్లో విశ్వకర్మభగవానుడి గురించి ప్రస్తావించబడిందన్నారు. విశ్వబ్రాహ్మణులు కులవృత్తులు చేస్తూ సమాజానికి ఎంతో తోడ్పాటునందిస్తున్నారని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ కార్యక్రమంలో కోట రాజబాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ట్రైకార్ చైర్మన్
డాక్టర్ బెల్లయ్యనాయక్
‘స్వస్థ్ నారీ..సశక్త్ పరివార్’ ప్రారంభం