
ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలి
కాళేశ్వరం: ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని డీఈఓ రాజేందర్ అన్నారు. బుధవారం మహదేవపూర్ మండలం కాళేశ్వరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు పూస్కుపల్లి, పలుగుల, మద్దులపల్లి ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూడైస్, ఎఫ్‌ఆర్‌ఎస్ (ఫేస్ రికగ్నైజేషన్ సిస్టమ్), ఎఫ్‌ఎల్‌ఎన్ (విద్యా సామర్థ్యాలు, అభ్యాసనాలు), ఎండీఎం రికార్డులు పరిశీలించారు. విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు గైర్హాజరు లేకుండా చూడాలన్నారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ రాజగోపాల్, కిషన్ రెడ్డి, హెచ్‌ఎంలు అన్నపూర్ణ, రమాదేవి, ఉపాధ్యాయులు రాజేందర్, శ్రీధర్, శ్యామ్, సీఆర్‌పీలు సతీష్, బానయ్య తదితరులు ఉన్నారు.
డీఈఓ రాజేందర్