మల్హర్: మండలంలోని తాడిచెర్ల బ్లాక్–1 ఓపెన్‌కాస్ట్‌లో బుధవారం ఏఎమ్మార్ ప్రాజెక్ట్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్‌రెడ్డి ఆదేశాల మేరకు సీనియర్ జనరల్ మేనేజర్ కేఎస్‌ఎన్ మూర్తి ఆధ్వర్యంలో స్వచ్ఛత హీ సేవ కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఉద్యోగులు, కార్మికులకు మాస్కులు, శానిటైజర్లు, టీషర్ట్స్ పంపిణీ చేశారు. ప్లాస్టిక్ వాడకం నిషేధం, మొక్కలు నాటడం, పరిసరాల పరిశుభ్రత తదితర కార్యక్రమాలు చేపట్టారు. ముగ్గురు పారిశుద్ధ్య కార్మికుల సేవలను గుర్తించి వారిని ఘనంగా సత్కరించారు. భారత ప్రభుత్వం, కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఆదేశాల మేరకు అక్టోబర్ 2న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాలు నిర్వహించినున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైన్ మేనేజర్ శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ సురేష్‌బాబు, హెచ్‌ఆర్ డీజీఎం రమేష్‌బాబు, అధికారులు, ఉద్యోగులు, సూపర్‌వైజర్లు, కార్మికులు పాల్గొన్నారు.
సాయుధ పోరాటం భావితరాలకు ఆదర్శం
రేగొండ: నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భావి తరాలకు ఆదర్శమని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి పైల్ల శాంతికుమార్ అన్నారు. బుధవారం సాయుధ పోరాట వారోత్సవాలను పురస్కరించుకుని సీపీఐ మండల కార్యదర్శి పెంట రవి ఆధ్వర్యంలో మండలంలోని రూపిరెడ్డిపల్లిలో పంచగిరి చాందయ్య స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర ఎంతో గొప్పదన్నారు. ఈ పోరాటాల్లో 4,500 మందికి పైగా కమ్యూనిస్టులు తమ ప్రాణాలను అర్పించారన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చంద్రమౌళి, రాజేందర్, భిక్షపతి, ఆగయ్య, తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం
భూపాలపల్లి రూరల్: జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిశిధర్‌రెడ్డి, జిల్లాలో కేంద్రంలో వివేకనంద సెంటర్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్‌సంఘ్ విభాగ్ ప్రచారక్ విఘ్నేష్, గ్రామాల్లో గ్రామ కమిటీ అధ్యక్షులు పాల్గొని జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఏడునూతుల నిషిధర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగపురి రాజమౌళి గౌడ్, పార్లమెంటు కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాద్ రావు, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి తిరుపతిరెడ్డి, కొడపాక స్వరూప జిల్లా ప్రధాన కార్యదర్శిలు దొంగల రాజేందర్, నాయకులు పెండ్యాల రాజు, తాటికొండ రవి కిరణ్, జిల్లా కార్యదర్శి శివరాత్రి వేణు, మునీందర్ తదితరులు పాల్గొన్నారు.
పుట్ట మధు, కొప్పుల ఈశ్వర్‌పై ఫిర్యాదు
కాటారం: దివంగత మాజీ స్పీకర్ శ్రీపాదరావు విగ్రహాలను తొలగిస్తానని పుట్ట మధు బెదిరింపులకు గురి చేస్తున్నారని, దీనిని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సహిస్తున్నారని మండల కేంద్రానికి చెందిన మహిళా కాంగ్రెస్ నాయకురాలు జాడి మహేశ్వరీ బుధవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కమాన్‌పూర్ మండలంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పుట్ట మధు తన అనుచరులతో సమావేశం పెట్టి త్వరలో బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం జరుగుతుందని శ్రీపాదరావు విగ్రహాలను తొలిగిస్తామని భయబ్రాంతులకు గురి చేసేలా మాట్లాడారన్నారు. విగ్రహాల రక్షణపై అనుమానం ఉందని, శ్రీపాదరావు విగ్రహాలకు ఏదైన జరిగితే పుట్ట మధు ప్రమేయంతోనే అన్నారు. ఇరువురిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్సై శ్రీనివాస్‌ని కోరారు. మహేశ్వరీ వెంట మహిళా కాంగ్రెస్ నాయకురాళ్లు ఉన్నారు.