
ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి
మొగుళ్లపల్లి : తెలంగాణ రాష్ట్ర అంబేడ్కర్ యువజన సంఘం 49వ ఆవిర్భావ దినోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పుల్ల మల్లయ్య అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద యువజన సంఘం మండల అధ్యక్షుడు మంగళపల్లి శ్రీనివాస్ అధ్యక్షతన ఆవిర్భావ దినోత్సవ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 26న జిల్లా కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నామని, ఉమ్మడి జిల్లా నుంచి అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు అధిక సంఖ్యలో తరలి రావాలన్నారు. ఈ కార్య క్రమంలో నాయకులు నిమ్మల భద్రయ్య, నరస య్య, కుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.