
కోటగుళ్లలో ప్రత్యేక పూజలు
గణపురం: తొలి శ్రావణ సోమవారం సందర్భంగా గణపురం మండలకేంద్రంలోని కాకతీయుల కళాక్షేత్రం కోటగుళ్లలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి గణపేశ్వరుడికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నాగరాజు ఆధ్వర్యంలో స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.
ముఖ గుర్తింపు ద్వారా
పింఛన్ చెల్లింపు
భూపాలపల్లి అర్బన్: ఆసరా పెన్షన్లను ఇక నుంచి ముఖ గుర్తింపు యాప్ ద్వారా చెల్లించనున్న ట్లు డీఆర్‌డీఓ బాలకృష్ణ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంతకాలం వేలి ముద్రలు వేసి పెన్షన్ పొందిన పెన్షన్‌దారులు ఇకపై ముఖ గుర్తింపు హాజరు ద్వారా డబ్బులు అందుకోనున్నట్లు తెలిపారు. ఈ విధానంతో సమ యం ఆదా, అవకతవకలు జరగకుండా పెన్షన్ సక్రమంగా అందనున్నట్లు పేర్కొన్నారు.
వేతనాలు చెల్లించాలి
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించాలని డీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిలువేరు ఆశోక్, అయిత తిరుపతి కోరారు. జిల్లా ఇన్‌చార్జ్ విద్యాశాఖ అధికారి రాజేందర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2008 సంవత్సరంలో కాంట్రాక్ట్ టీచర్స్‌గా వివిధ పాఠశాలల్లో నియామకమైనట్లు తెలిపారు. పెండింగ్ వేతనాలు జమచేసే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసరెడ్డి, దేవేంద్ర, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
పోలీసుల విస్తృత తనిఖీ
పలిమెల: మావోయిస్టు అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సోమవారం మండలం కేంద్రంలో పలిమెల ఎస్సై జె.రమేష్ అధ్వర్యంలో వాహనాల తనిఖీలు విస్తృతంగా నిర్వహించారు. ఈ మార్గం ద్వారా ప్రయాణించే వాహనదారులను ఆపి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు వారి సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సివిల్, టీఎస్‌ఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు.

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు

కోటగుళ్లలో ప్రత్యేక పూజలు