
కాళేశ్వరాలయంలో శ్రావణ సందడి
శ్రావణమాసం సోమవారం సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయంలో శ్రావణశోభ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేశారు. గోదావరి మాతను సైకత లింగాలను చేసి పూజించారు. గోదావరిలో దీపాలు వదిలి మొక్కులు చెల్లించారు. స్వామివారి గర్భగుడిలో ద్విలింగాలకు ప్రత్యేక అభిషేక పూజలు చేశారు. శ్రీశుభానందదేవి ఆలయంలో కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రీమహాసరస్వతి అమ్మవార్ల ఆలయాల్లో పూజలు చేశారు. మహిళలు ఉసిరిచెట్టు వద్ద దీపారాధనలు, ప్రదక్షిణలు చేశారు. దీంతో గోదావరి తీరం, ఆలయ పరిసరాల్లో భక్తుల రద్దీ కనిపించింది. ఈఓ మహేష్ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేపట్టారు.
– కాళేశ్వరం

కాళేశ్వరాలయంలో శ్రావణ సందడి