
మేడిగడ్డకు పెరిగిన వరద
కాళేశ్వరం: మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ప్రాణహిత వరద తాకిడితో గోదావరికి ప్రవాహం క్రమేపీ పెరుగుతుంది. ఆదివారం మహదేవపూర్ మండలం కాళేశ్వరంలో పుష్కరఘాట్లను తాకుతూ నీటిమట్టం దిగువకు ప్రవహించింది. దీంతో కాళేశ్వరం వద్ద 9.070 మీటర్ల ఎత్తులో నీటిమట్టం ప్రవహిస్తోంది. దిగువన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీకి వరదనీరు చేరి 4.40 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో తరలి రాగా.. మొత్తం 85 గేట్లు ఎత్తి అదేస్థాయిలో వరద నీటిని ఔట్‌ఫ్లోను దిగువకు ఇంజనీరింగ్ అధికారులు విడుదల చేస్తున్నారు.