
వ్యవసాయం చేసి.. కొడుకును అమెరికా పంపారు
టేకుమట్ల: ఈఫొటోలో కొడుకు, కోడలు, మనవళ్లతో ఉన్న వృద్ధ దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ఆశిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన దూబల శ్రీనివాస్–సరోజన. వీరికి ముగ్గురు కుమారులు.. కాగా పెద్ద కుమారుడు రమేశ్ తండ్రితో కలిసి వ్యవసాయం చేస్తుండగా.. రెండో కుమారుడు వెంకటేశ్ ఎంసీఏ, చిన్న కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొనసాగుతున్నారు. ఉన్న కొద్ది పాటి భూమిలో సాగు చేసుకుంటూ, మరికొన్ని రోజులు కూలీలుగా పనులు చేస్తూ కుమారులను ప్రయోజకులను చేశారు. కష్టపడి చదివించారు. ఎంసీఏ పూర్తి చేసిన రెండో కుమారుడు వెంకటేశ్ 2008లో అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. 2012, 2023లో రెండుసార్లు అమెరికాకు తీసుకెళ్లి అక్కడి పర్యాటక ప్రాంతాలను తల్లిదండ్రులకు చూపించాడు.