
దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి
● కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్
మల్హర్: భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి తప్పిదాలకు తావులేకుండా త్వరితగతిన పరిష్కరించా లని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్ అన్నా రు. మండల కేంద్రం తాడిచర్ల తహసీల్దార్ కార్యాలయాన్ని సబ్ కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా భూభారతి రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులు ఆన్‌లైన్‌లో నమోదు చేసిన వివరాలను తహసీల్దార్ రవికుమార్‌ను అడిగి తెలుసుకున్నారు. సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి చేపడుతున్న చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అన్ని దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించి పెండింగ్ లేకుండా చూడాలన్నారు. తహసీల్దార్ లాగిన్‌లో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించేందుకు కృషిచేయాలని తహసీల్దార్‌కు సూచించారు. అనంతరం గ్రంథాలయ భవనాన్ని పరిశీలించారు. తాడిచర్ల పీఏసీఎస్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను పరిశీలించారు. యూరియా స్టాక్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయాలి
కాటారం: భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన దరఖాస్తుదారులకు నోటీసులు జారీచేసి పరిశీలన పూర్తిచేయాలని కాటారం సబ్ కలెక్టర్ మయాంక్‌సింగ్ రెవెన్యూ అధికారులకు సూచించా రు. మహాముత్తారం మండలకేంద్రంలోని తహసీ ల్దార్ కార్యాలయాన్ని శనివారం సబ్‌కలెక్టర్ తనిఖీచేశారు. నూతనంగా నిర్మిస్తున్న కేజీబీవీ భవనాన్ని పరిశీలించారు. నాణ్యతతో కూడిన పనులు చేపట్టి త్వరితగతిన పూర్తిచేయాలని తెలిపారు. అధికారులు నిర్మాణ పనులను పర్యవేక్షించాలని సూచించారు. సబ్‌కలెక్టర్ వెంట తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ శ్రీనివాస్‌రావు, సిబ్బంది ఉన్నారు.