
పర్యావరణ సమతుల్యతను కాపాడాలి
భూపాలపల్లి అర్బన్: నేటితరం యువత ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ పర్యావరణ సమతుల్యతను కాపాడాలని ఏరియా ఇన్‌చార్జ్ జీఎం కవీంద్ర తెలిపారు. గురువారం ఏరియాలోని సింగరేణి పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత, జీవావరణ వ్యవస్థను సింగరేణి పరిసర ప్రాంతాల్లో స్థాపిస్తున్నట్లు చెప్పారు. ఖాళీ స్థలాలు, ఓబీలలో మొక్కలు నాటి సింగరేణి హరిత సింగరేణిగా మారుస్తున్నట్లు తెలిపారు. ప్రతీఒక్కరు తప్పనిసరిగా మూడు నుంచి ఆరుమొక్కలు నాటాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు రవికుమార్, పోషమల్లు, మారుతి, పాఠశాల ప్రిన్సిపాల్ జాన్సీరాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.