
జాప్యం లేకుండా సేవలు
భూపాలపల్లి అర్బన్: ఏరియాలో వివిధ గనులలో విధులు నిర్వర్తిస్తున్న సింగరేణి ఉద్యోగులకు జాప్యం లేకుండా సేవలు అందించాలని ఏరియా పర్సనల్ మేనేజర్ మారుతి తెలిపారు. అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌ల సంక్షేమ అధికారులతో మారుతి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతి మాట్లాడుతూ.. దరఖాస్తు చేసుకున్న ఉద్యోగులకు నిత్యం సమాచారం అందిస్తూ, వేగంగా పరిష్కరించాలని సూచించారు. అన్ని గనులు, డిపార్ట్‌మెంట్‌ల సంక్షేమ అధికారులు గైర్హాజరవుతున్న వారిని విధులకు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని తెలిపారు. సింగరేణి యాజమాన్యం ఇప్పుడున్న పరిస్థితులలో ఎలాంటి వారినైనా ఉపేక్షించకుండా డిస్మిస్‌చేసే అవకాశాలు త్వరలో రాబోతున్నాయన్నారు. గైర్హాజరు అవుతున్న ఉద్యోగులకు తెలియజేయాలని, విధులకు హాజరుకాని వారిపై క్రమశిక్షణ చర్యలు జాప్యం లేకుండా తీసుకునేలా గని మేనేజర్లకు చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ పర్సనల్ మేనేజర్లు గుండు రాజు, క్రాంతికుమార్, అన్ని గనుల సంక్షేమ అధికారులు అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు.