
అర్హులందరికీ రేషన్‌కార్డులు
ఏటూరునాగారం/మంగపేట/ఎస్‌ఎస్‌తాడ్వాయి/ కన్నాయిగూడెం: అర్హులందరికీ రేషన్ కార్డులను పంపిణీ చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. జిల్లాలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, మంగపేట మండలాల్లో మంగళవారం రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు నిర్వహించగా మంత్రి హాజరై మా ట్లాడారు. పదేళ్లుగా ప్రజలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే ఇచ్చినట్లు తెలిపారు. సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులు చాలా ప్రధానమన్నారు. ఇళ్లు, పింఛన్లు, ఆరోగ్యశ్రీ, వ్యక్తిగత బీమా సౌకర్యం, ఇతర అవసరాలకు కూడా రేషన్ కార్డు ప్రధానమని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో మంగళవారం నుంచి రేషన్ కార్డుల పంపిణీ చేపట్టినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సన్న బియ్యం పథకంలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. రేషన్‌కార్డుల ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని దళారులను నమ్మకుండా నేరుగా మీసేవ కేంద్రాల్లో, సంబంధిత మండల అధికారులకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మంగపేటలో రేషన్‌కార్డులతో పాటు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం ఎఫ్‌ఎస్‌సీఎస్ కార్యాలయ ఆవరణలో నాబార్డు, డీసీసీబీ వారి సహకారంతో మల్టీసర్వీస్ కోఆపరేటీవ్స్(ఎంఎస్‌సి) స్కీం ద్వారా రూ 76 లక్షల నిధులతో 1000 మెట్రిక్ టన్నుల నిల్వ చేసే సామర్ధ్యంతో నిర్మించిన నూతన గోదాంను ప్రారంభించారు.
డీసీసీ బ్యాంకు ప్రారంభం
ఏటూరునాగారం మండలంలోని తాళ్లగడ్డ ప్రాంతంలో నూతనంగా నిర్మించిన బ్యాంకును మంత్రి సీతక్క తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు, ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రాతో కలిసి ప్రారంభించారు.
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
మంత్రి సీతక్క