
విద్యార్థినులు చదువులో రాణించాలి
చిట్యాల: విద్యార్థినులు చదువుతో పాటు క్రీడలలో రాణించాలని కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం మండలకేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయాన్ని ఆసక్మికంగా తనిఖీ చేశారు. పదవ తరగతి క్లాస్‌రూంలోకి వెళ్లి విద్యార్థినులతో హిందీ పాఠం చదివించారు. స్టోర్‌రూం, వంట గదిని పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థినులు విద్యలో బాగా రాణించాలని అన్నారు. చక్కగా చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థినులకు ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు నిర్వహించాలని ప్రిన్సిపాల్‌కు సూచించారు. విద్యార్థినులతో స్నేహపూర్వకంగా ఉండాలని అన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో మురుగునీరు వెళ్లేందుకు అవుట్‌లేట్, కాంపౌండ్ వాల్, సోలార్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని కలెక్టర్‌కు పాఠశాల ప్రిన్సిపాల్ సుమలత కోరగా పరిష్కరించేందుకు కృషిచేస్తానని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీఈఓ రాజేందర్, ఎంఈఓ కొడెపాక రఘుపతి, ఎంపీడీఓ జయశ్రీ, ఎంపీఓ రామకృష్ణ, ప్రిన్సిపాల్ సుమలత, ఆర్‌ఐ రాజేందర్, పంచాయతీ కార్యదర్శి రవికుమార్ పాల్గొన్నారు.
కలెక్టర్ రాహుల్‌శర్మ