
స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తాచాటాలి
భూపాలపల్లి రూరల్: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుని సత్తా చాటాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. బుధవారం రాత్రి భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల ముఖ్య నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మాట్లాడారు. ప్రతి నాయకుడు, అంకిత భావంతో పనిచేయాలన్నారు. ప్రజల అభిమానం చూరగొన్న నాయకులకే ప్రాముఖ్యత ఉంటుందని తెలిపారు. అదేవిధంగా, ఈ నెల 18న ఉదయం 10 గంటలకు చిట్యాల మండల కేంద్రంలో జరిగే మహిళా శక్తి సంబురాలకు ముఖ్య అతిథిగా మంత్రి సీతక్క రానున్నట్లు తెలిపారు. ఈ సంబురాల్లో అన్ని గ్రామాల నుంచి పెద్దసంఖ్యలో మహిళలు పాల్గొనేలా చూడాలని నేతలకు ఎమ్మెల్యే సూచించారు. సమావేశంలో అర్బన్ అధ్యక్షుడు దేవన్, భూపాలపల్లి మండల పార్టీ అధ్యక్షుడు రాంచంద్రయ్య, జిల్లా నాయకులు రాంనర్సింహారెడ్డి(ఆర్‌ఎన్‌ఆర్) తదితర నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు